పిల్లల వయస్సు పెరిగే కొద్ది.. పెద్దల్లో టెన్షన్ పెరుగుతుంది. వయస్సు ముదిరితే తగిన జోడీ దొరుకుతుందో లేదో.. అనే కలవరం వారిని వెంటాడుతుంది. దీంతో పెళ్లి చేసుకోమంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారు. పెళ్లిల్ల పేరయ్య నుంచి.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల వరకు ప్రతిదీ వెతికేస్తారు. తమ నచ్చిన అమ్మాయి/అబ్బాయిల ఫొటోలు చూపిస్తూ చిత్ర హింసలు పెడతారు. కనీసం పదికి తగ్గకుండా పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేస్తారు. అందుకే.. ఓ యువకుడు వినూతన రీతిలో ‘అరేంజ్డ్ మ్యారెజ్’ వద్దంటూ సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటున్నాడు. 


యూకేలో నివసిస్తున్న 29 ఏళ్ల మహమ్మద్ మాలిక్‌ పేరు.. బర్మింగ్‌హమ్‌లో మారుమోగుతుంది. కేవలం అక్కడ మాత్రమే కాదు.. సోషల్ మీడియా దయవల్ల ప్రపంచమంతా అతడి గురించే మాట్లాడుకుంది. ఇందుకు కారణం.. అతడు ఆ నగరంలోని ఓ ప్రధాన కూడలిలో పెట్టిన ఓ భారీ హోర్డింగే. ‘‘అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి నన్ను రక్షించండి’’ అంటూ అతడు తన ఫొటోతో.. 20 అడుగుల బిల్ బోర్డ్ మీద ప్రకటించాడు. అంతేకాదు పూర్తి వివరాలకు FindMalikAWife.com సంప్రదించాలని పేర్కొన్నాడు. 


ఆ వెబ్‌సైట్‌లో ఏముందా అని వెళ్లి చూస్తే ఓ వీడియో ఉంది. అందులో అతడు తన అసలు ఉద్దేశం చెప్పాడు. ‘‘నా ఫేస్‌ను మీరు తప్పకుండా ఏదైనా బిల్‌బోర్డ్ మీద చూసి ఉంటారు. నా వయస్సు 29. నేను లా విదా లండన్‌లో ఉంటున్నా. నేను పారిశ్రామికవేత్తను. ఆహారప్రియుడిని. తన అవసరాల కోసం పనిచేస్తున్న సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి కోసం చూస్తున్నా. నేను పంజాబీ కుటుంబానికి చెందినవాడిని కాబట్టి.. 100 శాతం వెటకారం ఉండాలి’’ అని పేర్కొన్నాడు. 


‘అరేంజ్డ్ మ్యారేజ్ వద్దంటే.. నేను వాటికి వ్యతిరేకమని కాదు. చాలా ఇస్లామిక్ సంస్కృతులలో అరేంజ్డ్ మ్యారేజ్‌లు సాంప్రదాయంగా సాగుతున్నాయి. వాస్తవానికి అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, నేను స్వయంగా ఒకరిని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అని తెలిపాడు. 






Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...


Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి