డయాబెటిస్ సమస్యతో బాధపడుత్ను వారు తమ షుగర్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. చివరకు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఏయే ఆహారాలను తినాలో, వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ సమస్య ఉన్నవారు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ఆరోగ్య కరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల ఎక్కువ సేపు తినకుండా ఉన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి వేయదు. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
Also Read: రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోకండి... మంచి నిద్ర కోసం ఏం చేయాలి?
డయాబెటిస్ ఉన్నవారు తినకూడనివి
పాల ఉత్పత్తులు – వెన్న తీయని హోల్ మిల్క్, చీజ్, బటర్
స్వీట్లు – కుకీస్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్, ఇతర స్వీట్లు
మాంసం – మటన్, బీఫ్, పోర్క్
జ్యూస్‌లు – ప్యాకేజ్డ్ జ్యూస్, సోడాలు, ఇతర శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్
షుగర్ – తెల్లని చక్కెర
ప్రాసెస్ ఫుడ్స్ – చిప్స్, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, మాంసం
Also Read: సొరకాయ జ్యూస్‌తో... యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చెక్... సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి?
డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన ఆహారాలు
పండ్లు – యాపిల్స్, నారింజ, బెర్రీలు, జామ, పుచ్చకాయలు, బేరి పండ్లు
కూరగాయలు – బ్రోకలీ, కాలిఫ్లవర్, కీర దోస, పాల కూర, సొరకాయ, కాకర కాయ, బీర కాయ, టమాటాలు, బెండ కాయలు
తృణ ధాన్యాలు – ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్
పప్పు దినుసులు – సోయా, చిక్కుళ్లు, బీన్స్, కందిపప్పు, పెసలు, శనగలు
నట్స్ – బాదంపప్పు, వాల్ నట్స్, పిస్తా పప్పు
సీడ్స్ – చియా సీడ్స్, గుమ్మడి కాయ విత్తనాలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు
ప్రోటీన్లు – కోడిగుడ్లు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు
ఆరోగ్యకరమైన కొవ్వులు – ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె
Also Read: జామ కాయే కాదు... జామ ఆకులు కూడా ఎంతో మంచివి... ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?
డయాబెటిస్ ఉన్న వారు తప్పనిసరిగా వైద్యులు సూచించిన డైట్ తీసుకోవాలి. డైట్‌లో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, నట్స్, తృణ ధాన్యాలు, ఆలివ్ నూనెను ఎక్కువగా తీసుకుంటారు. చికెన్, చేపలు వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.