జామ కాయే కాదు జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి జామకాయలో కంటే జామ ఆకుల్లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.


* జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ C,శరీరానికి మంచి చేసే ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. 


 Also Read: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ తింటే మంచిది? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?


* జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలు అధికం. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జామాకులు నమలడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. 


* జామ కాయ జ్యూస్ లివర్‌కి మంచి టానిక్‌లా పని చేస్తుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 


* అంతేకాదు ఈ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పి, నోటి పూత తగ్గుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 


* శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు జామ ఆకులతో చేసిన టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇందులోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది.


జామ ఆకులతో టీ తయారీ విధానం: 
కొనీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. ఇలా తయారుచేసిన టీకి పంచదార లేదా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు. అయితే పాలను చేర్చకూడదు.


* జుట్టు పెరుగుదలకు కూడా జామ ఆకులు ఎంతో బాగా పని చేస్తాయి. కొన్ని నీళ్లని తీసుకుని అందులో జామ ఆకులు వేసి ఉడికించాలి. 10నిమిషాల అనంతరం ఆ నీటిని వడకట్టాలి. వడగట్టిన నీరు చల్లారిన తర్వాత వాటిని తలకు పట్టించాలి. గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జట్టు పెరుగుతుంది. 


 Also Read: కళ్ల కింద నల్లటి వలయాలు ఎలా తగ్గించుకోవాలి? వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి