ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు తదితర కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను వాడటం ద్వారా నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. కానీ వాటిలోని రసాయనాలు హానికరం. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గాలను రెండు రోజులు పాటిస్తే చాలు నల్లటి వలయాల నుంచి ఉపశమనం పొందవచ్చు. 


Also Read: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ తింటే మంచిది? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?


* ఒక టమోటో, ఒక టేబుల్ స్సూన్ నిమ్మరసం, చిటికెడు పెసర లేదా శెనగిపిండి, చిటికెడు పసుసు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చిక్కటి పేస్ట్‌ను కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.


* కీరదోస ముక్కల్ని చక్రాల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.


* రోజ్ వాటర్: కొద్దిగా దూది తీసుకుని రోజ్ వాటర్‌లో డిప్ చేసి, ఈ కాటన్ బాల్స్‌ను పది నిమిషాల పాటు కంటి చుట్టూ రుద్దండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కళ్లు తుడుచుకోవడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. 


* బంగాళా దుంప రసాన్ని కంటి కింద రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నలుపు క్రమంగా తగ్గుతుంది. 


* కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలి అంటే పచ్చి పాలలో దూది ముంచి రాయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే వలయాలు పోతాయి.


* కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంటి- చుట్టూ ప్యాక్‌లా వేయాలి. ఆరాక కడిగేస్తే చాలు.. ఎంతో మార్పు కనిపిస్తుంది.


Also Read: బ్రౌన్ బ్రెడ్ VSవైట్ బ్రెడ్‌.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఎందుకు మంచిది?


* బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.


* రాత్రిపూట పడుకునేముందు కొద్దిగా బాదం క్రీమ్‌ను కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి