చాలా మంది రోజూ ర‌కరకాల బ్రెడ్‌ల‌ను తింటుంటారు. వాటిల్లో బ్రౌన్ బ్రెడ్‌, వైట్ బ్రెడ్ కామ‌న్‌. వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్‌.. రెండింటిలో ఏది కొనాలో తెలియ‌క క‌న్‌ఫ్యూజ్ అవుతుంటాం. అయితే ఈ రెండింటిలో ఏ బ్రెడ్ మంచిది ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 


తెల్ల బ్రెడ్ క‌న్నా బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమ‌ల‌తో త‌యారు చేస్తారు. లేదా ఇత‌ర చిరు ధాన్యాలు, తృణ ధాన్యాల‌ను ఉప‌యోగిస్తారు. కానీ వైట్ బ్రెడ్ త‌యారీకి మైదాను వాడుతారు. క‌నుక వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందువ‌ల్ల బ్రౌన్ బ్రెడ్‌ను తినాల్సి ఉంటుంది. అది మ‌న‌కు మంచి ప్ర‌యోజనాల‌ను అందిస్తుంది.


Also Read: వైట్ రైస్‌, బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. వీటిల్లో ఏ రైస్ తింటే మంచిది? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?


బ్రౌన్ బ్రెడ్‌లో ర‌క ర‌కాల తృణ ధాన్యాలు క‌లుస్తాయి. క‌నుక అందులో ఫైబ‌ర్‌, మెగ్నిషియం, అనేక ర‌కాల విటమిన్లు ఉంటాయి. అందువ‌ల్ల‌ బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. అది మ‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గోధుమ‌ల‌తో చేసే బ్రౌన్ బ్రెడ్‌ను కూడా తీసుకోవ‌చ్చు. అది కూడా మంచిదే. కానీ అన్ని తృణ ధాన్యాలు లేదా చిరు ధాన్యాల‌తో చేసే మ‌ల్టీ గ్రెయిన్ లేదా మిల్లెట్స్ బ్రెడ్‌ల‌ను తిన‌డం ఇంకా మంచిది. దీంతో అనేక పోష‌కాలను పొంద‌వ‌చ్చు. అలాగే శ‌క్తి కూడా ల‌భిస్తుంది.


మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఊక మరియు ధాన్యం గింజలు గ్లైసెమిక్ సూచికను తక్కువగా ఉండేలా చేస్తాయి. గ్లైసెమిక్ సూచి తక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవటం వలన మధుమేహం, క్యాన్సర్ మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి.


Also Read: ఈ కాంబినేషన్‌ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది


Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘ABP దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి