AIDS Patient Care : ఎయిడ్స్ రోగులు చేయకూడని పనులివే.. జాగ్రత్త
AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. అసురిక్షత లైంగిక సంబంధాలు ఉన్నవారికి ఇది వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఉపయోగించిన సూదులను వాడడం, టాటూల వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది.
ఎయిడ్స్‌కు సరైన చికిత్స లేదు. ఎవరికైనా అది ఒకసారి సోకితే.. దానిని వదిలించుకోవడం కష్టమవుతుంది. మెడిసన్స్ ద్వారా లైఫ్ స్పామ్‌ని పెంచుకోవచ్చు కానీ.. అది ఎయిడ్స్‌ని క్యూర్ చేయదు.
అయితే ఎయిడ్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు కొన్ని పనులు చేయకూడదు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
ఎయిడ్స్ లేదా హెచ్ఐవీ సోకిన రోగులు ధూమపానం చేయకూడదు. మద్యం సేవించకూడదు. ఇవి పరిస్థితిని మరింత దిగజారిపోయేలా చేస్తాయి.
సరిగ్గా ఉడికించని మీట్‌ని కూడా డైట్లో తీసుకోకూడదు. పూర్తిగా ఉడికించిన నాన్‌వెజ్‌ని మాత్రమే తీసుకోవాలి. ఇది గట్ హెల్త్‌పై ఎఫెక్ట్ చూపించి రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది.
అలాగే సెక్స్‌లో కూడా కండోమ్ లేకుండా పాల్గొనకూడదు. దీనివల్ల ఇతరులకు వ్యాధి సోకించకుండా ఉంటుంది. అలాగే వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఎయిడ్స్ రోగి తన రక్తం, స్పెర్మ్ లేదా అవయవాలను ఎవరికి దానం చేయకూడదు. అలాగే తాము వినియోగించిన రేజర్, నెయిల్ కట్టర్‌ను కూడా ఇతరులు ఉపయోగించకుండా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.