రాత్రి పడుకునే ముందు మనం ఏం తింటున్నామా అనేది కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు తినే ఆహారం కారణంగా చాలా మందిలో గుండెల్లో మంట, గ్యాస్, నిద్రలేమి, అధిక బరువు లాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయట. కాబట్టి రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, మసాలాలు కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్నింటిని రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తినకూడదని చెబుతున్నారు.
Also Read: జామ కాయే కాదు... జామ ఆకులు కూడా ఎంతో మంచివి... ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?
పడుకునే ముందు ఏం తినకూడదు?
* పాస్తా, అన్నం, బంగాళదుంపలు కలిగిన ఫుడ్ రాత్రి పడుకునే ముందు తినకూడదు. ఇవి తినడం వల్ల బ్లడ్‌లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బాడీ మెటబాలిజమ్ తగ్గిపోతుంది. ఫలితంగా ఎనర్జీని కోల్పోతారు. వీటికి బదులు ప్రొటీన్లు కలిగి ఉండే ఆకుకూరలు లాంటివి తినడం మంచిది.
* రాత్రిపూట మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే.. గుండెల్లో మంట పుడుతుంది. ఛాతి కింది భాగంలో కూడా నొప్పి వస్తుంది. భవిష్యత్తులో ఇది పెద్ద సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
* డిన్నర్ టైంలో జిడ్డు ,కొవ్వుతో కూడుకున్న ఆహారం తినడం వల్ల అవి సరిగా అరగవు. అందుకే చాలా మందికి పేగుల్లో ఇబ్బందులు ఏర్పడి గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి.
* చాక్లెట్లలో ఉండే కెఫైన్ నిద్ర పట్టకుండా చేస్తుంది. అంతేకాదు కెఫైన్ తీసుకోవడం వల్ల నీరసం, వికారం, స్టమక్ ఇరిటేషన్స్ లాంటి వాటికి కారణమవుతుంది. కెఫైన్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల హార్ట్‌రేట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
* పడుకునేముందు వీలైనంత వరకు కొన్ని పానీయాలను తాగకుండా ఉండడమే మంచిది. కాఫీ, కూల్ డ్రింక్స్, చక్కెరతో కూడిన పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి మీకు నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తాయి. ఆ ప్రభావం మీ చర్మంపై పడుతుంది.
Also Read: సొరకాయ జ్యూస్‌తో... యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చెక్... సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి?
నిద్ర పోయే ముందు ఏం చేయాలి?
* నిద్ర పోయే ముందు మేకప్ రిమూవ్ చేసి పడుకోవడం తప్పనిసరిగా చేయాలి. లేదంటే స్కిన్ డ్రై గా మారిపోతుంది.
* రాత్రి పార్టీ ఉందన్నా, వర్క్ రిలేటెడ్ ఫంక్షన్‌లో ఆల్కహాల్ సర్వ్ చేస్తారని తెలిసినా మీ నిద్ర టైంకి రెండు మూడు గంటల ముందు ఆల్కహాల్ ఆపేసి నీరు తాగడం మొదలుపెట్టండి.
* వారానికి ఒకసారైనా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ మార్చాలి. లేదంటే మన బాడీ మీద, ఫేస్ మీద పేరుకున్న మురికి, జిడ్డు వాటికి అంటుతుంది. తద్వారా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* రూం టెంపరేచర్ కూడా నిద్రని ఎఫెక్ట్ చేస్తుంది. మరీ వేడిగా ఉన్నా, మరీ చల్లగా ఉన్నా సరిగ్గా నిద్ర పట్టదు. చలిగా లేదా ఉక్కగా ఉండకుండా చల్లగా ఉంటే మీకూ హాయిగా నిద్ర వస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.