ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు భయపెడుతుంది. ఇప్పటికే దేశంలో 23 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యాప్తి ఎక్కువగా ఉంది కానీ లక్షణాలు తక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ తాజాగా ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఒమిక్రాన్‌ను జయించిన ఓ వ్యక్తికి మళ్లీ కొవిడ్ సోకింది. 


అదేలా సాధ్యం..?


దేశంలో తొలిసారి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలిన ఇద్దరిలో ఒకరైన బెంగళూరు వైద్యుడికి మళ్లీ కొవిడ్ సోకింది. ఈ విషయాన్ని బృహత్​ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.


23కు చేరిన కేసులు..


భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్  కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.  


Also Read: Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?


Also Read: Rahul Gandhi In Lok Sabha: 'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'


Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!


Also Read: PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'


Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!


Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు


Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే


Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి


Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి