కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల అతడిపై మైసూరు విమానాశ్రయంలో ఒక వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విజయ్ మేనేజర్ దాడి చేసిన వ్యక్తిపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై విజయ్ సేతుపతి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. చిన్న గొడవ అని, తాగిన మైకంలో సదరు వ్యక్తి దాడి చేశాడని, ఈ ఘటనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.


తాజాగా ఈ ఘటనలో బాధితుడు, విజయ్ మేనేజర్ చేతిలో దెబ్బలు తిన్న గాంధీ అనే వ్యక్తి విజయ్ పై పరువునష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన గాంధీ ఆరోజు జరిగిన ఘటనను మీడియాకు వివరించాడు. ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిని ప్రశంసిస్తూ మాట్లాడితే.. ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని.. అంతేకాకకుండా తనపై దాడికి పాల్పడ్డారని చెప్పాడు. విజయ్ మేనేజర్ తనను తీవ్రంగా కొట్టాడని.. ఆ దాడిలో గాయాలు కావడంతో, తన చెవి పని చేయడం లేదని.. దీనికి ఆయన మూల్యం చెల్లించాలని గాంధీ చెప్పుకొచ్చాడు. 


అలానే గాంధీ తరఫు లాయర్ కూడా మీడియాతో మాట్లాడారు. గాంధీకి వెన్నెముక సమస్య ఉండడంతో వైద్య పరీక్షల కోసం మైసూరు వెళ్లారని, అనుకోకుండా ఎయిర్ పోస్ట్ లో విజయ్ సేతుపతిని చూడడం.. వారి మధ్య అపార్ధాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు విజయ్ సేతుపతి పక్కనే ఉన్న స్నేహితుల్లో ఒకరు గాంధీ చెవి మీద కొట్టారని చెప్పాడు. ఈ ఘటనలో ఆయన చెవి పూర్తిగా దెబ్బతిందని, ఇక ఆ చెవి పని చేయదని డాక్టర్ లు చెప్పినట్లు వెల్లడించారు. అది కాకుండా.. మీడియాలో విజయ్ సేతుపతి.. గాంధీ మద్యం సేవించి ఉన్నారని చెప్పడంతో అతడి ప్రతిష్టకు భంగం కలిగిందని.. అందుకే రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేశామని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో విజయ్ ఈ ఘటన నుంచి బయటపడేలా లేడు.  


Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన


Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం


Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?


Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?


Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి