భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజినీర్స్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్ మరియు కంప్యూటర్ సైన్స్) పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మెుత్తం 15 పోస్టులకు గానూ ఈ రిక్రూట్ మెంట్ జరుగుతోంది. అర్హులైన మరియు అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో బీఈఎల్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నం బీఈఎల్ లో కాంట్రాక్ట్‌పై విధానంలో నియామకం జరగనుంది. దీని కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 6, 2021న ప్రారంభమైంది. డిసెంబర్ 24, 2021న దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.


ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ  చేస్తారు. ఎలక్ట్రానిక్స్‌ (06), మెకానికల్‌ (06), కంప్యూటర్‌ సైన్స్‌ (03) పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ  ఫూర్తి చేసిన వారై ఉండాలి.  అంతేగాకుండా.. రెండేళ్ల అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 1-11-2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్‌ రూ.35,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.
 
ఎలా దరఖాస్తు చేయాలంటే..


బీఈఎల్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా.. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బీఈఎల్ వెబ్‌సైట్ ను సందర్శించాలి. అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. 


ఈ కింద్రి అడ్రస్ కు డిసెంబర్ 24, 2021లోపు పోస్ట్/ కొరియర్ పంపాలి...
Manager (HR), Bharat Electronics Limited, Ravindranath Tagore Road, Machilipatnam - 521001. 


అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 24 ను చివరి తేదీగా నిర్ణయించారనే విషయాన్ని అప్లై చేసుకునే వారు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి.


Also Read: CSIR Recruitment: సీఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.. జీతం ఏంతంటే.. 


Also Read: NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?


Also Read: CISF Recruitment: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి


Also Read: S.O. Recruitment 2021: పీజీ విద్యార్హతతో సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 45 ఏళ్లు వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు


Also Read: Jobs 2021: యూనివర్సిటీలలో వివిధ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్.. ఏమేం ఖాళీలు ఉన్నాయంటే..


Also Read: South Eastern Railway Recrutment: రైల్వేలో 17వందల పోస్టులకు నోటిఫికేషన్.. డిసెంబర్‌ 14లోపు అప్లై చేసుకోండి