త‌మిళ‌నాడు కరైకుడిలోని సీఎస్ఐఆర్-సెంట‌ర్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.. పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ తో టెక్నిక‌ల్ అసిస్టెంట్లు, టెక్నిషియ‌న్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెుత్తం 54 ఖాళీల‌కు గానూ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 


ఎంపికైన అభ్యర్థులకు రూ.28,216 నుంచి రూ.50,448 వ‌ర‌కు జీతం ఉంటుంది. వీటి కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటంది. పూర్తి సమాచారం కోసం ఈ https://cecri.res.in/Opportunities.aspx వెబ్ సైట్ ను చూడండి. 


టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత స‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కుల‌తో డిప్లమో, బీఎస్సీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.  మెుత్తం 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారికి రూ.50,448 జీతం ఉంటుంది. టెక్నిషియ‌న్‌ పోస్టులకు పదోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలి. మెుత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.28,216 జీతం ఉంటుంది.
 
ద‌ర‌ఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి  స్కిల్‌/ ట్రేడ్ టెస్ట్  పెడతారు.  టెక్నిక‌ల్ అసిస్టెంట్ అభ్యర్థులకు 200 ప్రశ్నలతో మూడు పేపర్లతో ప‌రీక్ష ఉంటుంది. టెక్నిషియ‌న్‌ పోస్టుకు మొత్తం 150 ప్రశ్నలతో మూడు పేపర్లతో ప‌రీక్ష  నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని పోస్టుల‌కు ఎంపిక చేస్తారు.


ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. అధికారిక వెబ్ సైటల్ అప్లై చేసుకున్నాక.. ద‌ర‌ఖాస్తు పూర్తి చేసిన త‌రువాత అప్లికేష‌న్ ప్రింట్ తీసుకోవాలి. కావాల్సిన డాక్యుమెంట్లతో కలిపి కింది అడ్రస్ కి పోస్టు చేయాలి. 
The Controller of Administration,
CSIR–Central Electrochemical Research Institute,
Karaikudi–630003, Tamil Nadu 


Also Read: NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?


Also Read: CISF Recruitment: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి


Also Read: S.O. Recruitment 2021: పీజీ విద్యార్హతతో సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 45 ఏళ్లు వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు


Also Read: Jobs 2021: యూనివర్సిటీలలో వివిధ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్.. ఏమేం ఖాళీలు ఉన్నాయంటే..


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి