భారత స్టాక్‌ మార్కెట్లు అత్యంత ఒడుదొడుకులకు లోనవుతున్నాయి! అయినప్పటికీ దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీవో బూమ్‌ మాత్రం తగ్గలేదు. ఈ వారం ఏకంగా నాలుగు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. ఏ కంపెనీలు, ఏ ధరతో, ఎప్పుడెప్పుడు వస్తున్నాయంటే..!


రేట్‌గెయిన్‌ I RateGain Travel Technologies: ఇది ట్రావెలింగ్‌ రంగానికి చెందిన కంపెనీ. ట్రావెల్‌, హాస్పిటాలిటీ కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తోంది. డిసెంబర్‌ 7న ఐపీవో మొదలవుతోంది. ధర రూ.405-425గా నిర్ణయించారు. ఒక లాట్‌కు 35 షేర్లు ఉన్నాయి. డిసెంబర్‌ 9న సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.14,175.


శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ I Shriram Properties: ఈ కంపెనీ స్థిరాస్తి రంగానికి చెందింది. చెన్నై కేంద్రంగా సేవలు అందిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌లో ఈ కంపెనీకి మంచి పేరే ఉంది! డిసెంబర్‌ 8న ఐపీవో సబ్‌స్క్రిప్షన్లు మొదలవుతాయి. దరఖాస్తు చేసేందుకు 10 చివరి తేదీ. ధరను రూ.113-118 గా నిర్ణయించారు. ఒక లాట్‌కు 125 షేర్లు కేటాయించారు. కనీస పెట్టుబడి రూ.14,125.


మ్యాప్‌ మై ఇండియా I MapmyIndia: దీని మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్‌ లిమిటెడ్‌. ఇదో డేటా, టెక్‌ కంపెనీ. డిసెంబర్‌ 9 నుంచి 13 వరకు ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు. ధర రూ.1000-1033గా నిర్ణయించారు. కనీస పెట్టుబడి రూ.14000.


మెట్రోబ్రాండ్స్‌ I Metro Brands: ఈ కంపెనీని రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇదో పాదరక్షల కంపెనీ. ఐపీవో డిసెంబర్‌ 10న మొదలై 14న ముగుస్తుంది. ధర రూ.485-500గా నిర్ణయించారు. కనీస పెట్టుబడి రూ.14,550.






Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!


Also Read: Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్‌ తీసుకొస్తోంది తెలుసా?


Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!


Also Read: GST Update: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గింపు.. ఎవ్వరూ అడగట్లేదన్న కేంద్రం!


Also Read: Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..


Also Read:Petrol-Diesel Price, 7 December: వాహనదారులకు గుడ్‌న్యూస్! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో ఎంత తగ్గిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి