ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''పుష్ప: ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్ జోరు పెంచిన యూనిట్ తాజాగా ట్రైలర్ లాంచ్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన 'పుష్ప' పార్ట్-1 ట్రైలర్ కొన్ని గంటల్లోనే  మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది.  అడవి బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ సీన్స్  బన్నీ ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. సునీల్, అనసూయ క్యారెక్టర్స్ కూడా సినిమాపై మరింత ఆసక్తి రెపుతున్నాయి. ఇక ఊర మాస్ పుష్పరాజ్ అవతారంలో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడంటున్నారు సినీ ప్రియులు. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా.. ఫైరు..' అంటూ సీమ యాసలో చెప్పే డైలాగ్ మామూలుగా లేదు. ఈ ట్రైలర్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇందులో ఐటెం సాంగ్ చేస్తున్న సమంత కూడా ట్రైలర్ పై రియాక్టైంది. 






'పుష్ప రాజ్‌.. తగ్గేదే లే..' అని రాసి ఫైర్‌ ఎమోజీస్‌ ట్వీట్‌ చేసింది సమంత. ఈ మూవీలో సామ్ ఐటెం సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ . నాగచైత‌న్య‌తో విడాకులు ప్రకటించిన తర్వాత టాలీవుడ్ లో సమంత సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. పైగా సామ్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ ఐట‌మ్ సాంగ్‌ చేస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పటికే సుక్కూతో' రంగస్థలం ' సినిమా చేసిన సామ్...బన్నీతో కలసి' సన్నాఫ్ సత్యమూర్తి'లో నటించింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న పుష్పలో ఐటెం సాంగ్ అంటే అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోన్న  'పుష్ప' డిసెంబర్‌ 17న థియేటర్లో సందడి చేయనుంది.  
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం...
Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
Also Read: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి