సాధారణంగా చాలా మందికి శరీరం వేడిగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడే కాదు.. ఎప్పుడు పట్టుకున్నా వారి చర్మం వేడిగానే అనిపిస్తుంది. కొంతమంది నీ ఒళ్లు వేడిగా ఉంది... జ్వరం వచ్చిందా అని అడుగుతుంటారు. కానీ, వాళ్లకి జ్వరం కాదు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరం అలా వేడిగా ఉంటుంది.


శరీరంలో వేడి కలగడానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం. ఉప్పు, కారం, మసాల ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకున్నా, జంక్ ఫుడ్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకున్నా, మద్యం ఎక్కువగా సేవించినా, మాంసాహారం ఎక్కువగా తిన్నా శరీరం వేడిగా అవుతోంది. శరీరానికి తగినన్ని నీళ్లు తాగకపోయినా వేడి ఉంటుంది. 


Also Read: బీట్ రూట్‌ని బలవంతంగా కాదు ఇష్టంగా తినండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇదో ఔషధాల గని


శరీరంలో వేడి ఎక్కువైతే మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. మూత్రం తక్కువగా వస్తుంది. మూత్రం పసుపు రంగులో వస్తుంది. మరికొంత మందిలో మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. పాదాలు, చర్మం పగులుతున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే శరీరంలో వేడి ఉన్నట్లు. ఇలాంటి వారు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. 


* రోజులో మూడు సార్లు కీరదోసను తీసుకుంటే శరీరంలో వేడి వెంటనే తగ్గుతుంది. మూడు సార్లు అంటే మూడు కీరదోసలను తినాలి. ముక్కలుగా తినలేకపోతే జ్యూస్ రూపంలోనైనా తీసుకోవచ్చు. అలాగే పుదీనా రసాన్ని పరగడుపున ఒక చిన్న టీ కప్పు తీసుకోవాలి. 


Also Read: రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి? ఎలా తినాలి? కలిగే ప్రయోజనాలంటి?


* అలాగే తర్భూజ పండ్ల మొక్కలు లేదా జ్యూస్ తీసుకోవాలి. పుచ్చకాయలు, సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. 


* గంధం కూడా వేడిని త్వరగా తగ్గిస్తుంది. గంధాన్ని అరగదీసి ఆ పేస్ట్‌ను నుదుటిపై రాసుకోవాలి. 


* రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. నారింజ, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లను తినాలి. 


* నిమ్మరసం రోజూ తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది. అలాగే అలోవెరా జ్యూస్ తాగినా వేడిని తగ్గిస్తుంది.


* కాచి చల్లార్చిన గ్లాసు పాలల్లో ఓ టీ స్పూన్ తేనె కలుపుకొని తాగితే మంచిది. ఇలా చేస్తే వేడి మొత్తం పోయి... శరీరం చల్లబడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి