సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఆఫ్‌లైన్ (Offline) విధానంలో పరీక్షలు రాసిన వారితో పాటుగా సీబీఎస్సీ కంపార్ట్‌మెంట్ (Compartment), ఇంప్రూవ్‌మెంట్ (Improvement) పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను రిలీజ్ అయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థుల ఫలితాలను రేపు (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది.
ఈ ఏడాది కోవిడ్ తీవ్రత కారణంగా 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులకు 30 శాతం.. 11వ తరగతిలో సాధించిన మార్కులకు మరో 30 శాతం.. 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ బోర్డ్ పరీక్షల్లో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించింది. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను కేటాయించి ఫలితాలను విడుదల చేసింది.
Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
త్వరలో 10వ తరగతి ఫలితాలు
క్వాలిఫయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉంచుతామని బోర్డు తెలిపింది. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి మరో పరీక్ష రాసే సదుపాయాన్ని కూడా బోర్డు కల్పించింది. కోవిడ్ పరిస్థితులు సర్దుమణిగాక పరీక్షలు రాసుకునే ఛాన్స్ ఇస్తామని బోర్డు తెలిపింది. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ.. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేసింది. 10వ తరగతి స్పెషల్ ఎగ్జామినేషన్స్ ఫలితాలు కూడా త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
1. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.in ను ఓపెన్ చేయాలి.
2. ఇక్కడ Senior School Certificate Compartment Examination (Class XII) Results 2021 అనే లింక్ మీద క్లిక్ చేయాలి. (ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
3. దీంతో మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్ వివరాలను అందించి సబ్మిట్ చేయాలి.
4. దీంతో ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Also Read: AP PolyCET 2021: పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Read: NEET PG 2021: నీట్ ఫలితాలు ఖరారు.. త్వరలోనే లింక్ అందుబాటులోకి.. చెక్ చేసుకోవడం ఇలా..