నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), పీజీ 2021 ఫలితాలను ఖరారు చేశారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్సామ్స్ మంగళవారం (సెప్టెంబరు 29) ఈ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలకు సంబంధించిన వెబ్‌సైట్ లింక్‌ను త్వరలోనే అందుబాటులో ఉంచుతామని బోర్డు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం nbe.edu.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?


తాజాగా విడుదల చేసిన నీట్ పీజీ 2021 పరీక్ష సెప్టెంబరు 11న దేశ వ్యాప్తంగా జరిగింది. మొత్తం 260 నగరాల్లో 800 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తున్నట్లుగా నేషనల్ ఎక్సామినేషన్ బోర్డు ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫలితాలకు సంబంధించిన లింకును త్వరలోనే తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెడతామని వివరించింది. విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యేందుకు అన్ని కేటగిరీల్లో కటాఫ్ మార్కులను కూడా ప్రకటించారు. 


Also Read: CBSE On Covid19: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన


Also Read: SBI Clerk Mains exam 2021: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేశాయ్.. 


నీట్ పీజీ 2021 ఫలితాలను ఎలా చేసుకోవాలంటే..
* nde.edu.in అధికారిక వెబ్‌సైట్‌లోకి అభ్యర్థులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.


* హోం పేజీలో ‘నీట్ పీజీ 2021’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి


* కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పరీక్షకు సంబంధించిన సమాచారం ఉంటుంది.


* అందులోనే ‘నీట్ పీజీ 2021 రిజల్ట్స్’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి (ఇది త్వరలోనే యాక్టివేట్ అవుతుంది)


* అందులో క్రెడెన్షియల్స్ (రోల్ నెంబర్, పాస్ వర్డ్) ఎంటర్ చేయాలి.


* వెంటనే నీట్ పీజీ 2021 ఫలితాలు అక్కడే కనిపిస్తాయి. దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు లేదా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also Read:  విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..


Also Read: Exams Postponed: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్.. నేడు, రేపు పలు పరీక్షలు వాయిదా.. పూర్తి వివరాలివే..


Also Read: జగతి పబ్లికేషన్స్‌ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా.. పెన్నా కేసులో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసిన సీఎం జగన్, విజయసాయిరెడ్డి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి