స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్లర్క్ మెయిన్స్ 2021 పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్) పోస్టులకు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 1 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ (SBI) ప్రకటించింది. క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను ఎస్‌బీఐ విడుదల చేసింది. ప్రిలిమనరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.. మెయిన్స్ రాసేందుకు అర్హులు. వీరు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ వ్యవధి రెండు గంటల 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ /ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి 190 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి.


Also Read: Scholarship Programs: విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..


ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 18 సర్కిళ్లలో క్లరికల్ కేడర్‌లో 5,000 పైగా జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమనరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో కూడా అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్ల ఆధారంగా అర్హుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల్లో పనిచేయాల్సి ఉంటుంది. 


విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాలు..
క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలను ఎస్‌బీఐ విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జూలై, ఆగస్టు నెలల్లో ఎస్‌బీఐ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరైన వారు తమ ఫలితాలు, మెరిట్ లిస్ట్‌ను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 27 నుంచి మే 17 వరకు దరఖాస్తు ప్రక్రియ చేపట్టారు. 


Also Read: CBSE On Covid19: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన
ప్రిలిమ్స్ ఫలితాలు చెక్ చేసుకోండిలా.. 
1. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజీలో ‘కెరీర్స్’ అని ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
3. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు అనే లింక్‌పై క్లిక్ చేయండి.
4. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అందించాలి. 
5. పరీక్ష ఫలితాలు కనిపిస్తాయి. దీని పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.


Also Read: AP PGECET 2021: ఏపీ పీజీఈసెట్ హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


Also Read: JEE Main Counselling 2021: అక్టోబర్‌ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. అడ్వాన్స్‌డ్ గడువు పెంపు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి