సాయిధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ విడుదలకు సిద్ధంగా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతుందని చిరంజీవి ట్విట్టర్ లో ప్రకటించారు. తాజాగా విడుదలైన రిపబ్లిక్ ట్రైలర్ అదిరిపోయింది. పవరఫుల్ డైలాగులతో తేజు జోరు చూపించాడు. ట్రైలర్ లో ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్’, ‘గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ’లాంటి అదిరిపోయే డైలాగులతో రిపబ్లిక్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్ చూసిన వాళ్లకి ఎవరికైనా ఈ సినిమా రాష్ట్రంలోని ప్రభుత్వానికి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు మధ్య జరిగే యుద్ధంలా అర్థమవుతుంది. తేజు ఇందులో కలెక్టర్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా సినిమాను అక్టోబర్ 1నే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. తేజుకి మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
మెగా స్థార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో రిపబ్లిక్ మూవీ ట్రైలర్ ను పోస్టు చేశారు. దాంతో పాటూ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్ కూడా ఇచ్చారు. తేజు కోరిక మేరకు సినిమా అక్టోబర్ 1న విడుదల చేస్తున్నామని చెప్పారు. తేజు కోలుకుంటున్నాడని, అభిమానుల ఆదరణ, అభిమానం, ప్రేమే శ్రీరామ రక్ష అని అన్నారు.
Also read: యాసిడ్ - జాన్వి డెస్టినేషన్ పెళ్లి... విందులో చికెన్ బిర్యానీ, ట్రెండవుతున్న పెళ్లి వీడియో
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం
Also read: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..