తెలుగు రాష్ట్రాలను గులాబ్ తుపాను గజగజా వణికించింది మరవకముందే.. మరో హెచ్చరిక అందుతోంది. ఇప్పటికే గులాబ్ తుపాను ఉత్తరాంధ్ర సహా మొత్తం ఆరు జిల్లాలను గజగజా వణికించింది. ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం ఉత్తరకొంకన్ ప్రాంతం నుంచి నైరుతి విదర్భ, ఉత్తరకోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం .కొనసాగుతోంది. దీనితో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.






 


దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.  రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలోని పలుప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం తుపాను ప్రభావం తగ్గిపోతున్నప్పటికీ.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  ఇప్పటికే ‘గులాబ్’ తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి సీజన్‌లో అత్యధికంగా 95.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.






 


 


Also Read: Petrol-Diesel Price, 29 September: పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు.. హైదరాబాద్ సహా చాలా చోట్ల పెరుగుదల