పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్​ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ పోలా భాస్కర్ విజయవాడలో విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా పాలిసెట్ 2021 అడ్మిషన్లు అక్టోబర్ 1 నుంచి 6 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించనున్నారు.  అక్టోబర్ 3 నుoచి 7వరకు సర్టిఫికెట్లు పరిశీలన చేస్తామని, అక్టోబర్ 3 నుoచి 8వరకు ఆప్షన్ల ఎంపిక, అక్టోబర్ 11న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 18నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పోలా భాస్కర్ తెలిపారు. 


ఈ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.. https:// appolycet.nic.in


ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాంమని పోలా భాస్కర్ తెలిపారు. విద్యార్థులకి స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
 
రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు.



  • అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.

  • అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. 

  • అక్టోబర్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం.

  • అక్టోబర్ 9న ఆప్షన్స్‌ మార్చుకునే అవకాశం.

  • అక్టోబర్ 11న సీట్లు కేటాయింపు.

  • అక్టోబర్ 12 నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

  • 18వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభం.


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: NEET PG 2021: నీట్ ఫలితాలు ఖరారు.. త్వరలోనే లింక్ అందుబాటులోకి.. చెక్ చేసుకోవడం ఇలా..


Also Read: Exams Postponed: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు పరీక్షలు వాయిదా వేసిన వర్సిటీలు..


Also Read: UGC Scholarships: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..


Also Read: Career Guidance: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్..