గులాబ్ తుపాన్ తెలుగు రాష్ట్రాలను అస్తవ్యస్తం చేసింది. ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో సెప్టెంబర్ 29న జరగనున్న పరీక్షల్ని సైతం అధికారులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జేఎన్‌టీయూ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అదికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్ 30 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. రేపు జరగనున్న ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Also Read: తెలంగాణ దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు.. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు..
అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా..
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), మహాత్మాగాంధీ వర్సిటీ, ఇతర వర్సిటీల పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో తేదీలు వెల్లడిస్తామని వర్సిటీల రిజిస్ట్రార్లు చెబుతున్నారు. మరోవైపు టీఎస్ పీఈసెట్ సైతం వాయిదా పడింది. వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 30న నిర్వహించాల్సిన TSPECET-2021 ప్రవేశ పరీక్ష వాయిదా వేశారు. అక్టోబర్ 23న నిర్వహిస్తామని, పరీక్షా కేంద్రాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
హైదరాబాద్‌లో వర్షం..
హైదరాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం సైతం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా బహదూర్‌పుర మండలంలో 16.3 మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, కాప్రాలలో 2.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రవహిస్తున్న నీళ్ల నుంచి దాటుతూ వెళ్లే ప్రయత్నం చేయవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ లోని అంబర్‌పేట వద్ద మూసీనదిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ కొట్టుకు వచ్చింది. వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నందున చాదర్ ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి