అనాల్సినవి అన్నీ అని కులాల చాటు దాక్కుంటే లాక్కుని వచ్చికొడతామని వైఎస్ఆర్‌సీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుక ధనం, మదం, అహంకారం, అధికారం అన్నీ ఉన్నాయని కానీ భయం లేదని అన్నారు. ఆ భయం ఏమిటో తాను నేర్పిస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలకు వారి తల్లిదండ్రులు నేర్పించలేని సంస్కారం తాను ఎలా నేర్పించగలనని ప్రశ్నించారు. 


కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం..!
తాను ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడితే వారు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన జీవితం బ్లాక్ అండ్ వైట్ అని స్పష్టం చేశారు. తాను నాలుగు భాషల్లో తిట్టగలనని కానీ తాను ఎప్పుడూ గీత దాటబోనని స్పష్టం చేశారు. తాను ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అలా కాదు ఇంకో రకంగా కావాలంటే తాను సిద్ధం అని ప్రకటించారు. తాను హీరోను కానని స్పష్టం చేశారు. తన తండ్రి సీఎం కాదని.. తనకు ఎస్టేట్‌లు ఇవ్వలేదన్నారు. గత్యంతరం లేకే సినిమాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చానన్నారు. రాజకీయాల్లో కలుపు మొక్కల్ని తీసేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉంటే ప్రతి సన్నాసితో తిట్టించుకోవాలన్సిన అవసరం లేదన్నారు. అయితే తాను మర్చిపోయే ప్రసక్తి లేదని .. ప్రతీ దానికి సమాధానం చెబుతానని హెచ్చరించారు. తిట్టే కొద్దీ బలపడతాను కానీ బలహీనపడననిస్పష్టం చేశారు. కోడికత్తి , కిరాయి మూకలకు భయపడబోననిస్పష్టం చేశారు.


Also Read : పోసానిపై జనసేన ఫిర్యాదు.. లీగల్‌ ఒపీనియన్‌ కోరిన పోలీసులు


మీ అధినేత పిల్లికి బిచ్చం వేస్తారా ?
రాజకీయాల్లోకి తాను ఏదో మెడల్ సాధించడం కోసం రాలేదన్నారు. రూ. ఐదువందలు ఇస్తే మన ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుందని మద్యం బ్రాండ్ల గురించి సెటైర్ వేశారు. ఏపీలో రోడ్లు వేయడానికి నిధులు ఉండవన్నారు. మీరు మర్యాద స్థాయి దాటితే.. తాను దాటితే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా రూ. లక్ష కోట్లకుపైగా ఆదాయం వస్తుందని.. కానీ ఆ డబ్బంతా ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. జీతాలివ్వరు.. పెన్షన్లు ఇవ్వరు. అభివద్ధి పనులు చేయరని మండిపడ్డారు. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరు అని ప్రశ్నించానన్నారు. ఓ పని చేయండి.. ఇళ్లలోకి దూరి బంగారం దోచుకెళ్లాలని వైఎస్ఆర్‌సీపీ నేతలను ఎద్దేవా చేశారు. తనకేమీ సినిమా ధియేటర్లు లేవని..వైసీపీ వారికే ఉన్నాయని గుర్తు చేసారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాట్లకుక్కలా అరుస్తారెందుకని మాట్లాడటం రాదా అని ప్రశ్నించారు. మీ అధినేతకు రూ. 700 కోట్ల ఆస్తులున్నాయని ఎప్పుడైా పిల్లికి బిచ్చమేశారా అని ప్రశ్నించారు. 


Also Read : డ్రగ్స్ పోయి బూతులు వచ్చే ఢాం..ఢాం..ఢాం ! రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్సేనా ?


వైఎస్ఆర్‌సీపీకీ కమ్మవారు వర్గ శత్రువులు ! 
తాను డబ్బులు సంపాదించుకోలేక కాదని .. ధనం ఎక్కువైతే భయం ఎక్కువ అవుతుందన్నారు. తన ధనం  ధైర్యం అని.. ద్రవ్యం కాదన్నారు. తన ఆత్మగౌరవానని దెబ్బకొడితే.. తాను ఇంకో మనిషినన్నారు.  వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గ శత్రువులుగా కమ్మవారిని చూస్తుందని కానీ జనసేనకు మాత్రం పేదరికం, అవినీతి, దాష్టీకం చేసేవారని గుర్తు చేశారు. జనసేనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తానన్నారు. శాంతిభద్రతలుఎలా ఉంటాయో చూపిస్తాన్నారు. ఏదైనా గుడ్డి ద్వేషం సరి కాదన్నారు. రాష్ట్రం అంటే రెండు కులాలు కాదని.. వర్గపోరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 


Also Read : వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం ! అప్పుడేం జరిగిందంటే ?


వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయాం  !
పవన్ కల్యాణ్ ప్రసంగంలో వంగవీటి రంగా ప్రస్తావన కూడా ప్రధానంగా వచ్చింది. వంగవీటి రంగాను కలవలేదని కానీ చూశానన్నారు. ఆయన సభలు పెడితే కృష్ణాతీరం నిండిపోయేదని చెప్పేవాళ్లన్నారు. రంగాకు అప్పటి పాలకుల నుంచిప్రాణభయం ఉన్నా... సత్యాగ్రహం చేస్తూంటే చుట్టూ వంద మంది కూర్చుని ఉన్నా రక్షించుకోలేకపోయారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల విషయంలోనూ పవన్ మాట్లాడారు. కనీసం వైజాగ్‌లో గెలిపించినా స్టీల్ ప్లాంట్ కోసం నిలబడేవాడినన్నారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం బలంగా నిలబడినా ఓట్లన్నీ వైసీపీకి వేశారని అన్నారు. ఓట్లన్నీ వైసీపీకి వేసి తనను ని చేయమంటే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మీరు కూడా ఆలోచించాలని ప్రజలకు సూచించారు. 


Also Read : పవన్, పోసాని వివాదంపై స్పందించిన నాగబాబు.. ఫన్నీ మీమ్స్‌తో సమాధానం


ఆశయం మార్చుకోవడానికి వ్యూహం మార్చుకుంటా ! 
తన ఐడియాలజీ కన్ఫ్యూజింగ్‌గా ఉందన్న విమర్శలకు కూడా ప వన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదన్నారు. ఒక దేశానికి ఒక నది సరిపోతుందా అి ప్రశ్నించారు. మీరు వేరే పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవచ్చా..  మా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ‌అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని 151 సీట్లు ఉన్నాయ వైసీపీ 15సీట్లకు వస్తుందన్నారు. అప్పుడు పాండవుల సభ ఏమిటో చూపిస్తామన్నారు. 


Also Read : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి