‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్క్‌తో ఇండి సభ్యులకు ఆహారం విలువ తెలుస్తోంది. కెప్టెన్సీ పోటీలో భాగంగా బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్‌లో ‘గెలవాంటే తగ్గాల్సిందే’ అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల బరువును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంట్లో ఆహారాన్ని మొత్తం తీసుకెళ్లిపోయి.. కేవలం ‘ఫుడ్ బండి’ ద్వారా ఆహారాన్ని పంపిస్తూ.. సభ్యులను టెంప్ట్ చేస్తున్నాడు. ఇంట్లో ఆహారం లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్‌లో ఆకలి కేకలు మొదలయ్యాయి.


మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్, లోబో జంటకు శ్రీరామ్-హమీదా జంటకు మధ్య బకెట్ పోటీ జరిగింది. ఇందులో శ్రీరామ్-హమీద జంట గెలిచారు. అప్పటి నుంచి నటరాజ్ మాస్టర్ తన వింత ప్రవర్తనతో ఇంటి సభ్యులను ఆశ్చర్యపరచడం మొదలుపెట్టారు. నెటిజనులు సైతం ఆయన్ని ‘అపరిచితుడు’ అని ట్రోల్ చేస్తున్నారు. అయితే, బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల ఆకలి బాధలను చూస్తే తప్పకుండా జాలేస్తుంది. ముఖ్యంగా లోబో.. ఆకలిని తట్టుకోలేక చెత్త బుట్టలో ఆహారం కోసం వెతుక్కోవడం, ఇంటి సభ్యులు అటుగా వస్తున్నారని తెలిసి.. ముఖం కడుకున్నట్లు నటించడం చూస్తే గుండె బరువెక్కక మానదు. అక్కడ సందర్భం ఎలా ఉన్నా.. ప్రోమోలో మాత్రం విషాద సంగీతంతో ఈ రోజు ఎపిసోడ్‌పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశారు. 


‘బిగ్ బాస్ 5’ ప్రోమో: 



Also Read: కెప్టెన్సీ టాస్క్ కోసం నటరాజ్ మాస్టర్ తిప్పలు.. ప్రియాను హగ్ చేసుకున్న లోబో.. 


బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం.. ‘ఫుడ్ బండి’ వచ్చిన తర్వాతే ఇంటి సభ్యుల్లో ఒకరు ఆహారం తీసుకోవాలి. అయితే, లోబో తాను దాచుకున్న ఆహారాన్ని తిన్నాడు. దీనిపై బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూల్ తప్పినందుకు కెప్టెన్ జెస్సీతోపాటు అతడికి పార్టనర్‌గా ఉన్న కాజల్‌ను కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించారు. దీంతో జస్సీ ఆగ్రహానికి గురయ్యాడు. తాను వారిస్తున్నా.. నీకు మానవత్వం లేదా అన్నారని, ఇప్పుడు చూడండి ఏమైందో అనుకుంటూ వెళ్లిపోవడాన్ని ప్రోమోలో చూడవచ్చు. ఈ సారి వచ్చిన ‘ఫుడ్ బండి’లోని బిర్యానీని ప్రియాంకా తీసుకుంది. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు బిర్యానీని వాసన చూడంటాన్ని వీడియోలో చూపించారు. మరి, కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి. 


Also Read: హార్ట్ ఎటాక్ vs కార్డియాక్ అరెస్ట్: గుండె జబ్బులు లేకపోయిన హృదయం ఆగుతుంది.. ఎందుకో తెలుసా?


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి