ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప: ద రైజ్'. ఇటీవల విడుదల అయ్యింది. అల్లు అర్జున్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు చాలా మందిని ఆకట్టుకుంటోంది. అయితే... కథ, క్లైమాక్స్ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు కొందరు, ప్రేక్షకుల్లో కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తం అయ్యింది. కథ ఎలా ఉంది? అనే విషయం పక్కన పెడితే... ఈ కథకు, విదేశీ వెబ్ సిరీస్ 'నార్కోస్'కు పోలికలు ఉన్నాయని కొంత మంది మేథావులు చెబుతున్నారు. అదీ పక్కన పెడితే... 'పుష్ప' కథ తనదే అని చిత్తూరు జిల్లాలోని ఓ విలేకరి ఆరోపిస్తున్నారు.


'పుష్ప' కథ తనదేనని చిత్తూరు జిల్లాలో క్రైమ్ రిపోర్టర్ ఆదినారాయణ అనే ఆయన ఆరోపణలు చేశారు. 'రంగస్థలం' విడుదల అయిన తర్వాత వందో రోజు నుంచి సుకుమార్‌తో ట‌చ్‌లో ఉన్నాన‌ని, తనను 'కె.జి.యఫ్' లాంటి కథ కావాలని అడిగితే... ఇసుక మాఫియా నేపథ్యంలో ఒకటి, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మరొకటి కథ చెబితే 'పుష్ప' కథ తీసుకుని క్రెడిట్ ఇవ్వలేదని ఆదినారాయణ చేస్తున్న ఆరోపణ.


స్టార్ హీరోల సినిమాలు విడుదల అయిన తర్వాత ఇటువంటి ఆరోపణలు రావడం సహజమే. 'ఆచార్య' సినిమా విడుదలకు ముందే ఒక రచయిత తన కథ కాపీ కొట్టారని ఒకరు మీడియా ముందుకు వచ్చారు. 'శ్రీమంతుడు' విడుదల తర్వాత కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ మూడు సినిమాలకు మాత్రమే కాదు, అగ్ర దర్శకులకు కథల విషయంలో ఇటువంటి ఆరోపణలు తప్పడం లేదు. కొంత మంది పబ్లిసిటీ కోసం తన కథను కాపీ చేశారని మీడియాకు ఎక్కుతున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Also Read: పెళ్లి ఒకడితో... ఫస్ట్ నైట్ ఇంకొకడితో టైప్ నా వల్ల అవ్వట్లేదు! - తమన్
Also Read: బాలకృష్ణ, రవితేజ మధ్య గొడవ ఏంటి? ఇదిగో తెలుసుకోండి!!
Also Read: అనసూయను తీసేయండి... రష్మీని తీసుకు రండి!
Also Read: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...
Also Read: అసభ్యకర సందేశాలు.. ఇంటికి వచ్చి మరీ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి