'మొదలుపెట్టే ముందు బాసూ... మనకి ఒక క్లారిటీ తీసుకోవాలి' - బాలకృష్ణ'ఏంటో చెప్పండి?' - రవితేజ అడిగారు. చేతులు కట్టుకుని!'నీకు... నాకు పెద్ద గొడవ అయ్యిందంటగా!' - బాలకృష్ణ నెక్స్ట్ డైలాగ్.ఒక్కసారిగా రవితేజ నవ్వేశారు. కట్టుకున్న చేతులు పక్కన పెట్టి కొంచెం పక్కకి జరిగారు.'పని పాట లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని' అని రవితేజ అన్నారు. అక్కడితో మేటర్ క్లోజ్. ఇద్దరి మధ్య ఏం లేదని క్లారిటీ వచ్చింది.
నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. దీనికి మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నా... ఆ తర్వాత డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. లేటెస్టుగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.రవితేజ ఎప్పుడూ హుషారుగా ఉంటారు. బాలకృష్ణ ఎంత సరదాగా ఉంటారనేది ఈ షో ద్వారా జనాలకు తెలిసింది. వీళ్లిద్దరూ కలిసి ఒక రేంజ్ లో సందడి చేసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. 'నీకు కోపం వచ్చినప్పుడు వాడే ఓ నాలుగు బూతులు చెప్పు బాసూ' అని బాలకృష్ణ అడిగితే... 'నేను బూతులు మొదలు పెడితే చస్తారు గానీ' అని రవితేజ అన్నారు. రవితేజ అమ్మాయిలకు లైన్ వేసిన విషయాలు కూడా బాలకృష్ణ అడిగారు. డ్రగ్స్ కేసు విషయం కూడా బాలకృష్ణ ప్రస్తావించారు. ఆ కేసు గురించి తెలిసి తొలుత తనకు ఆశ్చ కలిగిందని రవితేజ చెప్పుకొచ్చారు. తనకు ఏ విషయంలో బాధ కలిగిందనేది కూడా రవితేజ చెప్పినట్టు తెలిసింది. అదేంటో షోలో చూడాలి. 'జై బాలయ్య' పాటకు రవితేజ స్టెప్పులు వేయడం ప్రోమోలో హైలైట్.'అఖండ' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాకు ముందు ఆయన రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన కూడా టాక్ షోకు వచ్చారు. నెక్స్ట్ తనకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే కొడతాను అన్నట్టు బాలకృష్ణ సరదాగా అన్నారు.Here's the Unstoppable Episode promo... featuring Ravi Teja, Gopichand Malineni: