దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ఉదయం వరకూ ఆ సినిమా వచ్చిన వారం ఐదు రోజులకు 'భీమ్లా నాయక్' వస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు భావించారు. మళ్లీ జనవరి 14న ప్రభాస్ 'రాధే శ్యామ్' ఉంది. మూడు భారీ సినిమాలు సంక్రాంతికి వస్తే... వసూళ్ల పరంగా మూడు సినిమాలకు నష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందారు. ఓ విధంగా నిర్మాతలకూ ఆ టెన్షన్ ఉందనేది ఇండస్ట్రీ టాక్. అయితే... తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లింది. జనవరి 12న విడుదల కావాల్సిన సినిమాను ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' పాన్ ఇండియా సినిమాలు కాబట్టి వాటికి దారిచ్చింది. ఈ సందర్భంగా సినిమాలు వాయిదా వేసుకున్న హీరోలు, నిర్మాతలకు రాజమౌళి థాంక్స్ చెప్పారు.
"సంక్రాంతి బరిలో పోటీ లేకుండా చూడాలని మొదట చొరవ తీసుకున్న వ్యక్తి మహేష్ బాబు. 'సర్కారు వారి పాట' పక్కా పొంగల్ సినిమా అయినప్పటికీ... వేసవికి వాయిదా వేశారు. ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించారు. నా హీరోకి, మైత్రీ మూవీ మేకర్స్ బృందానికి థాంక్స్. 'ఎఫ్ 3' మూవీ వాయిదా వేసిన 'దిల్' రాజు గారికి, చిత్ర బృందానికి థాంక్స్. 'భీమ్లా నాయక్' వాయిదా వేయాలని పవన్ కల్యాణ్ గారు, నిర్మాత చినబాబు (సూర్యదేవర రాధాకృష్ణ) గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం" అని రాజమౌళి ట్వీట్ చేశారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలైన వారం రోజుల పాటు థియేటర్ల దగ్గర ఎటువంటి పోటీ లేదు. ఆ తర్వాత 'రాధే శ్యామ్' తప్ప మరో భారీ సినిమా దగ్గరలో లేదు. సో... 'ఆర్ఆర్ఆర్'కు పోటీ లేదు. అందువల్ల, అందరికీ రాజమౌళి థాంక్స్ చెప్పారు. నిజం చెప్పాలంటే... మొదట మహేష్ బాబు 'సర్కారు వారి పాట' కూడా సంక్రాంతి బరిలో ఉంది. 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటించిన తర్వాత తన సినిమాను మహేష్ వాయిదా వేశారు.


Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: పవర్ స్టార్ అభిమానులకు నిర్మాత సారీ... పవన్ చెప్పడం వల్లే!
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి