ప్రముఖ మలయాళ నటి పార్వతి 'బెంగుళూరు డేస్', 'టేకాఫ్', 'చార్లీ' వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన 'ఉయిరే' అనే సినిమా మలయాళంలో భారీ విజయాన్ని అందుకుంది. నటి సమంత కూడా ఈ సినిమాలో పార్వతి పెర్ఫార్మన్స్ ను పొగుడుతూ అప్పట్లో పోస్ట్ పెట్టింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించగలిగింది పార్వతి. 


ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ కేరళ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెని వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా పార్వతి వెంటపడుతూ ఆమెని వేధిస్తున్నాడు. 


ఎంతలా అంటే.. డెలివెరీ బాయ్ అవతరమెత్తి ఫుడ్ పార్శిల్స్ తీసుకొని ఏకంగా పార్వతి ఉండే అపార్ట్మెంట్ కు వెళ్లి రచ్చ చేసేవాడట. పార్వతితో పాటు ఆమె కుటుంబసభ్యులు వద్దని అతడిని హెచ్చరించినా.. వినలేదట. తరచూ ఇంటికి వస్తూ.. ఆమెకి ఇబ్బంది కలిగిస్తూనే ఉండేవాడట. సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఓపక్క ఇంటికి వచ్చి వేధిస్తూ.. మరోపక్క సెల్ ఫోన్ కి అసభ్యకర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడంటూ పార్వతి పోలీసులకు వెల్లడించింది. 


ఆమె కంప్లైంట్ మేరకు పోలీసులు హర్ష అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. 2019లో కూడా పార్వతి ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. కిషోర్ అనే వ్యక్తి ఫిలిం మేకర్ గా పార్వతి కుటుంబాన్ని పరిచయం చేసుకొని.. ఆమెని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Also Read:బన్నీ సినిమా రీమేక్.. హీరోకి వార్నింగ్ ఇచ్చిన నటి..


Also Read: స్టార్ హీరోలు.. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదే..


Also Read:కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..


Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..


Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..


Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి