ABP  WhatsApp

Instagram Account Hacked: 'నా పిల్లల ఇన్‌స్టా ఖాతాలు కూడా హ్యాక్.. సర్కార్‌కు ఇంకేం పని లేదా?'

ABP Desam Updated at: 21 Dec 2021 07:36 PM (IST)
Edited By: Murali Krishna

ప్రభుత్వం తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.

సర్కార్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు

NEXT PREV

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ పిల్లల ఇన్‌స్టా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను ఉత్తర్‌ప్రేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్యాప్ చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆరోపించడంతో ప్రియాంక వ్యాఖ్యలపై చర్చ నెలకొంది.







ప్రతిపక్ష నేతల ఫోన్లే కాదు నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది. ఈ ట్యాపింగ్ తప్ప వారికి ఇంకేం పని ఉండదా? -                                                                   ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


నా ఫోన్ ట్యాప్ చేశారు..


యోగి ఆదిత్యానాథ్​ తన ఫోన్లను ట్యాప్​ చేస్తున్నారని అఖిలేశ్ యాదవ్ ఇటీవల ఆరోపణలు చేశారు. అన్నారు. ప్రతి సాయంత్రం తన కాల్స్​ను ఆయన వింటున్నారన్నారు.



మా ఫోన్ సంభాషణలన్నీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వింటున్నారు. ప్రతి సాయంత్రం ఈ 'నిరుపయోగి' (యోగి ఆదిత్యనాథ్) కొందరి ఫోన్ రికార్డింగులను ఆయన వద్దకు తెప్పించుకుంటున్నారు. నాతో మాట్లాడే విలేకరులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో ఓడిపోతామని భాజపాకు తెలిస్తే.. వివిధ ఏజెన్సీలను తమకు అనుకూలంగా వాడుకుంటుందన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసు.                                               - అఖిలేఖ్ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత


యోగి కౌంటర్..


అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. అఖిలేశ్ యాదవ్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేసి ఉంటారని అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్


Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 21 Dec 2021 06:44 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.