తెలుగులో పవన్, తమిళంలో విజయ్ - స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో విజయ్ (Vijay)కు కూడా అటువంటి క్రేజ్ ఉంది. ఇప్పుడీ ఇద్దరితో నటించే అవకాశం ఓ కొత్త కథానాయికకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరు? అంటే ప్రియాంకా అరుళ్ మోహన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రాఘవేంద్రరావు క్లాప్‌తో గోపీచంద్ - శ్రీనువైట్ల సినిమా షురూ
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నూతన చిత్రం ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది. ఆయన 32వ చిత్రమిది (Gopichand 32 Movie). చిత్రాలయము స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్ర హీరోలతో విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీను వైట్ల, కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
వివాదంలో సోనియా అగర్వాల్ మూవీ, ఆ టైటిల్ పెట్టొద్దంటూ బెదిరిపులు
నటి సోనియా అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఆమె తాజాగా '7/G' అనే చిత్రంలో నటిస్తోంది. శృతి, వెంకట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సోనియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈచిత్రంలో ఆమె దయ్యం క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హరూన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. అంతేకాదు, దర్శకుడికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
క్రేజీ న్యూస్ చెప్పిన ‘పెదకాపు’ మేకర్స్ - ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?
ఒకప్పుడు చక్కటి క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ప్రస్తుతం తన రూటు మార్చారు. క్లాస్ సినిమాలను కాసేపు పక్కన పెట్టి మాస్ సినిమాలను డీల్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘నారప్ప’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘పెదకాపు 1’ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నాగ చైతన్య - చందు మొండేటి మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 2018లో గుజరాత్ నుంచి వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత కథ ఆధారితంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)