ఒకప్పుడు చక్కటి క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ప్రస్తుతం తన రూటు మార్చారు. క్లాస్ సినిమాలను కాసేపు పక్కన పెట్టి మాస్ సినిమాలను డీల్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘నారప్ప’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘పెదకాపు 1’ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుంది.


సెప్టెంబర్ 11న ‘పెద్దకాపు1’ ట్రైలర్ విడుదల


తాజాగా ‘పెదకాపు 1’ సినిమాకు సంబంధించిన మేకర్స్ కీలక విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 11న మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేసిన వాయిస్ అందరినీ ఆకట్టుకుంటోంది.

“భగవంతుడే లోకమంతా నిండి ఉన్నప్పుడు, భగవంతుడే అంతా తానై ఉన్నప్పుడు, ఇక ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? పుణ్యం ఏంటి? పాపం ఏంటి? మరి మనిషి అనుభవం మాట? సామాన్యుడికి తగిలే దెబ్బల మాట? వాటి సంగతేంటి?  సామాన్యుడిగా మనిషి ఎప్పుడూ దుఃఖం నుంచి సుఖంలోకి, చీకటి నుంచి వెలుగులోకి రావాలనే అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తను పోయేవాడికి, ఆ దారే మూసేసి తొక్కెయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు. సెప్టెంబర్ 29న చూద్దాం.. ‘పెదకాపు’- ఓ సామాన్యుడి సంతకం” అంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వాయిస్ నోట్ విడుదల చేశారు.






ఆకట్టుకున్న ‘పెదకాపు 1’ టీజర్


ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘పెదకాపు 1’ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ ప్రసంగంతో మొదలైన టీజర్‌లో గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న ప్రజలు, వారిని కాపాడేందుకు హీరో ఎదురు తిరగడాన్ని చూపించారు. వారిద్దరు కలిసి హీరోను ఎలా టార్గెట్ చేస్తారు అనే విషయాన్ని సైతం ఇందులో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు  “మా నాన్న ఎప్పుడు ఒక మాట చెబుతుండేవాడు, బాగా బతకడమంటే నిన్నటి కంటే ఇయ్యాల బాగుండాలి, ఇయ్యాల కంటే రేపు బాగుండాలని” అని హీరో చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.


సెప్టెంబర్ 29న ‘పెదకాపు 1’ విడుదల  


‘పెదకాపు’ చిత్రంతో విరాట్‌ కర్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ‘అఖండ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రావు రమేష్, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.


Read Also: నాగ చైతన్య - చందు మొండేటి మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial