అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 2018లో గుజరాత్ నుంచి వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌ గార్డుల‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత కథ ఆధారితంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.


అక్టోబర్ 20 నుంచి షూటింగ్ ప్రారంభం


ఈ సినిమాకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు నాగచైతన్య, చందు మొండేటి, బన్నీ వాసు రీసెంట్ గా శ్రీకాకుళం వెళ్లారు. ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. చేపల వేటకు సంబంధించిన విషయాలతో పాటు చేపలు పట్టే సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌ డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. శ్రీకాకుళంలోనే షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా కథ రాయడం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తైనట్లు టాక్ నడుస్తోంది. దీంతో షూటింగ్ షురూ చేసేందుకు చిత్రబృందం  ప్రయత్నిస్తోంది.   


హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్?


ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.  వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ఇద్దరిని ఎంపిక చేశారట. వారిలో ఒకరు సాయి పల్లవి కాగా, మరొకరు కీర్తి సురేష్. వీరిద్దరి పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు కీర్తి సురేష్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయి పల్లవి నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. కీర్తి సురేష్ కూడా త్వరలో శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె వారితో కలిసి వారం రోజుల పాటు గడపనున్నట్లు తెలుస్తోంది.



ప్రేక్షకులను ఆకట్టుకోని ‘కస్టడీ’


నాగ చైతన్య చివరి మూవీ ‘కస్టడీ’ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాకు అన్ని చోట్లా  మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆశించిన రీతిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రాలేదు. దీనికి తోడు విడుదలకు ముందు ఎక్కువ బజ్ కూడా క్రియేట్ కాలేదు. కలెక్షన్లు కూడా చాలా తక్కువ వచ్చాయి. ప్రస్తుతం చై, చందు మొండేటి చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు.  


Read Also: నవీన్ నువ్వో జెమ్, అనుష్క ఛార్మింగ్ - ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’పై సమంత రివ్యూ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial