సౌత్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తొలి షో నుంచే ఈ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. నవీన్ పొలిశెట్టి నటన, ఆయన కామెడీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  


‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రంపై సమంత పొగడ్తలు   


తాజాగా ఈ చిత్రంపై సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పొగడ్తల వర్షం కురిపించింది. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నట్లు వెల్లడించింది. తనను ఇంతగా నవ్వించినందుకు నవీన్ పొలిశెట్టికి ధన్యవాదాలు చెప్పింది. అంతేకాదు, నువ్వో జెమ్ అంటూ నవీన్ ను సమంత ప్రశంసించింది. ఛార్మింగ్ అనుష్కతో పాటు ఈ చిత్రం బృందం మొత్తానికి ఆమె శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఓ పోస్టు పెట్టింది.  


‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ సినిమాపై రాజమౌళి ప్రశంసలు


అటు ఇప్పటికే  ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి మెచ్చుకున్నారు. మూవీ టీమ్ ను  అభినందిస్తూ ట్వీట్ చేశారు.  “చాలా రోజుల తర్వాత రెండు సినిమాలను చూశాను. స్వీటీ(అనుష్క) ఎప్పటిలాగానే చాలా అందంగా కనిపించింది.  నవీన్ పోలిశెట్టి నవ్వుల పువ్వులు పూయించాడు. చక్కటి కామెడీని పంచాడు. చక్కటి విజయం సాధించిన  ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ను చాలా సరదాగా, వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకుడు మహేష్ కు అభినందనలు” అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.   


చాలా గ్యాప్ తర్వాత హిట్ అందుకున్న అనుష్క


అనుష్క కెరీర్ లో‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ 48వ చిత్రంగా థియేటర్లలోకి అడుగు పెట్టింది. 'నిశ్శబ్దం' తర్వాత సుమారు 5 ఏండ్ల గ్యాప్ తీసుకుని ఆమె నటించిన సినిమా ఇది. మరోవైపు 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‍ బాస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో నటించారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' సక్సెస్  తర్వాత ఆయనకు హ్యాట్రిక్ మూవీ ఇది.  సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.  ఈ సినిమాకి రధన్ సంగీతం అందించారు.


Read Also: సౌత్ బాటపడుతున్న బాలీవుడ్ స్టార్స్, విజయ్ దళపతి మూవీలో విలన్‌గా అమీర్ ఖాన్?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial