'సలార్' విడుదల (Salaar Release) ఎప్పుడు? ఇప్పుడు ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్! ఎందుకంటే... సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదు (Salaar Postponed) అనేది నూటికి నూరుపాళ్ళు నిజం! అది తెలిసి ఆ రోజు, తర్వాత రోజు నాలుగైదు తెలుగు, తమిళ  సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే... ఇప్పటి వరకు తమ సినిమా విడుదల వాయిదా పడిందని 'సలార్' దర్శక, నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దాంతో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.


టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తున్నారు!
Salaar Tickets Amount Refund : 'సలార్' వాయిదా పడిందని బలంగా చెప్పడానికి ఆధారం ఏమిటంటే... టికెట్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారు. వాయిదా వేయాలని అనుకోవడానికి ముందు ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు కూడా! సెప్టెంబర్ 28న రిలీజ్ క్యాన్సిల్ కావడంతో వాళ్ళకు టికెట్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నామని బుకింగ్స్ యాప్స్ నుంచి మెసేజ్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు.


Also Read : 'జవాన్' హిట్టే కానీ 'బాహుబలి 2'ని బీట్ చేయలేదు - ప్రభాస్ రికార్డ్స్ సేఫ్!






దీపావళికి వస్తుందా? లేదంటే తర్వాత నెలలోనా?
Salaar New Release Date : ఇప్పటి వరకు 'సలార్' వాయిదా మీద మాత్రమే కాదు, కొత్త విడుదల తేదీ మీద కూడా ఎటువంటి సమాచారం లేదు. తొలుత ఇయర్ ఎండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. డిసెంబరులో రావచ్చని అనుకున్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా నవంబర్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఏ విషయమైనా సరే... అధికారికంగా అనౌన్స్ చేసే వరకు నమ్మలేం. సీజీ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కావడం మీద న్యూ రిలీజ్ డేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది.


Also Read షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?



 
'సలార్' ప్లేసులో ఐదు సినిమాలు!
'సలార్' వాయిదా పడటంతో పాటు మరో సినిమాలను వెనక్కి తీసుకు వెళ్ళింది. హౌ? అంటే... 'సలార్' కంటే ముందు వినాయక చవితికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన రామ్ పోతినేని, బోయపాటి శ్రీనుల 'స్కంద'ను సెప్టెంబర్ 28కి తీసుకు వెళ్లారు. అదొక్కటే కాదు... రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించిన 'చంద్రముఖి 2' కూడా వాయిదా పడింది. వీటితో పాటు 'రూల్స్ రంజన్', 'మ్యాడ్' చిత్రాలు ఆ తేదీకి వస్తున్నాయి. 'పెదకాపు 1' సెప్టెంబర్ 29న విడుదలకు రెడీ అయ్యింది. 


'సలార్'లో ఎవరెవరు ఉన్నారు?
'కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. దీనిని  కూడా 'కెజియఫ్' నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. ఆద్య పాత్రలో ఆమె కనిపిస్తారు. ప్రభాస్, శృతి హాసన్ కలయికలో మొదటి చిత్రమిది. ఇందులో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.


వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు హీరో జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial