'పఠాన్'తో బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఈ ఏడాది భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమాకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు వచ్చాయి. 'పఠాన్' జనవరి 25న విడుదలైతే... ఎనిమిది నెలల వ్యవధిలో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు షారుఖ్. 


తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్ ఖాన్ చేసిన సినిమా 'జవాన్' (Jawan Movie). ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. 'పఠాన్' విజయం తర్వాత వచ్చిన సినిమా కనుక ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. అట్లీ ఉండటంతో తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. 


'జవాన్'లో కథ, కథనాలు పక్కన పెడితే... సౌత్ స్టైల్ కమర్షియల్ సినిమాలో షారుఖ్ స్టైల్, హీరోయిజం బావుందని పేరు వచ్చింది. అభిమానులు ఆశించే అంశాలు అన్నీ ఉన్నాయని విమర్శలు సైతం పేర్కొన్నారు. మాస్ హిట్ అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందీకి ఈ స్టైల్ కొత్త కావడంతో అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. భారీ వసూళ్లు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంతకీ, ఈ సినిమాకు షారుఖ్ ఖాన్ ఎంత డబ్బులు తీసుకున్నారో తెలుసా?


షారుఖ్ ఒక్కడికీ రూ. 100 కోట్లు!
'జవాన్'ను షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. హోమ్ ప్రొడక్షన్ అయినా సరే హీరో షారుఖ్ రెమ్యూనరేషన్ లెక్క కట్టాలి కదా! ఈ సినిమాకు గాను ఆయనకి పారితోషికం కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. మరి, హీరోయిన్ & విలన్ రోల్స్ చేసిన వాళ్ళకు ఎంత ఇచ్చారో తెలుసా?


నయనతారకు 10 కోట్లు...
విజయ్ సేతుపతికి 20 కోట్లు!
'జవాన్'తో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) హిందీ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు భాషల్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అందుకని, ఆమెకు రూ. 10 కోట్లు ఇచ్చారని టాక్. విలన్ రోల్ చేసిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి రూ. 20 కోట్లు ఇచ్చారట. తమిళ, తెలుగు ప్రేక్షకులతో పాటు ఆయనకు హిందీలో కూడా ఫాలోయింగ్ ఉంది.


Also Read జవాన్ రివ్యూ : షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?  


'జవాన్' కంటే ముందు షాహిద్ కపూర్ హీరోగా రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన 'ఫర్జీ' వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి నటించారు. అందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ చేశారు. అందులో ఆయన నటనకు గాను మంచి పేరు వచ్చింది. కత్రీనా కైఫ్ జోడీగా 'మేరీ క్రిస్మస్' సినిమా చేశారు. ఈ ఏడాది క్రిస్మస్ కంటే కొంచెం ముందు డిసెంబర్ 15న విడుదల కానుంది.


'పఠాన్' రికార్డులను 'జవాన్' బ్రేక్ చేస్తుందా?
కథ పరంగా 'జవాన్'కు పెద్ద పేరు ఏమీ రాలేదు. కానీ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు మెండుగా ఉన్నాయని పేరు వచ్చింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దాంతో 'పఠాన్' రికార్డులను బ్రేక్ చేస్తుందా? బాక్సాఫీస్ బరిలో వెయ్యి కోట్లు కొల్లగొడుతుందా? లేదా? అని చాలా మంది చర్చలు మొదలు పెట్టారు. 


Also Read 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రివ్యూ : అనుష్క, నవీన్ పోలిశెట్టిల సినిమా హిట్టా? ఫట్టా?  



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial