తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరైన అనుష్క (Anushka) నటించిన తాజా సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఇది 'బాహుబలి 2', 'భాగమతి' చిత్రాల తర్వాత ఆమెకు థియేట్రికల్ రిలీజ్. సుమారు ఐదేళ్ళ విరామం తర్వాత వెండితెరపై అనుష్క సందడి చేసిన సినిమాగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు, 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' విజయాల తర్వాత ఆయనకు హ్యాట్రిక్ చిత్రమిది. థియేటర్లలో విడుదలకు ముందు సినిమా డిజిటల్ & శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. ఇంతకీ, ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా?


నెట్‌ఫ్లిక్స్ చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
Miss Shetty Mr Polishetty OTT Platform : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల చేశారు. ఓటీటీలో హిందీ భాషలో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. 


జీ గ్రూప్ టీవీకి 'శెట్టి పోలిశెట్టి' శాటిలైట్
Miss Shetty Mr Polishetty Satellite Rights : ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటే... శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ జీ సొంతం చేసుకుంది. ఆ సంస్థకు చెందిన టీవీ ఛానళ్లలో సినిమా టెలికాస్ట్ అవుతుంది.


Also  Read 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రివ్యూ : అనుష్క, నవీన్ పోలిశెట్టిల సినిమా హిట్టా? ఫట్టా?   


సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'కి మొదటి రోజు మొదటి ఆట నుంచి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో ఫన్ వర్కవుట్ అయ్యింది. స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి నటన, ఆయన పంచ్ డైలాగులకు ప్రేక్షకులు పడీపడీ నవ్వుతున్నారు. 


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ నిర్మించారు. 'మిర్చి', 'భాగమతి' సినిమాల తర్వాత అనుష్కతో ఈ సంస్థ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. 'రా రా కృష్ణయ్య' తర్వాత ఆయన తీసిన చిత్రమిది.


Also  Read జవాన్ రివ్యూ : షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?



'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కథకు వస్తే... అన్విత ఆర్. శెట్టి (అనుష్క) ఎప్పటికీ పెళ్ళి చేసుకోవాలని అనుకోదు. ఏడు  అడుగులు వేయడానికి ఆమె వ్యతిరేకం. తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలై... తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని పెళ్ళి చేసుకోకుండా బిడ్డను కనాలని అనుకుంటుంది. అప్పుడు ఆమెకు సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. అతను ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. స్టాండప్ కామెడీ అంటే ప్రేమ. అనుష్క పరిచయం తర్వాత అతని జీవితంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? ఇద్దరి మధ్య పరిచయం ఏ తీరాలకు చేరింది? అనుష్క కోరిక తెలిసిన తర్వాత సిద్ధూ ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial