'టైగర్ నాగేశ్వరరావు' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1970 ల కాలంలో స్టువర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. రవితేజ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమా ప్రమోషన్స్ ని మ్యూజిక్‌తో స్టార్ట్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన 'మ్యాడ్'!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఓ కథానాయకుడిగా నటించిన సినిమా 'మ్యాడ్'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రమిది. యువతరం మెచ్చే కథతో ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా 'మ్యాడ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రక్షా బంధన్ రోజున చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ప్రభాస్ అభిమానులకు షాక్ - 'సలార్' విడుదల వాయిదా!?
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సలార్'. 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ తాము కోరుకున్న విధంగా తమ అభిమాన కథానాయకుడిని చూపిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. వాళ్ళకు భారీ షాక్ తగిలే అంశం ఇది. 'సలార్' విడుదల ఎప్పుడు? ఈ ప్రశ్న ప్రేక్షకులు ఎవరిని అడిగినా సరే... సెప్టెంబర్ 28 అని చెబుతారు. అయితే... ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ఆ తేదీకి ఈ సినిమా వచ్చే అవకాశం లేదట! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రజినీకాంత్‌కు బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కళానిధి మారన్, ధర ఎంతో తెలుసా?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ను నిర్మాతలు, సినిమా బృందం అంతా గొప్పగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్‌కు సన్‌ పిక్చర్స్‌ అధినేత కళానిధి మారన్‌ సూపర్‌ లగ్జరీ కారును గిఫ్ట్‌‌గా ఇచ్చారు. సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్‌7 కారును ఆయనకు అందించారు. సన్‌పిక్చర్స్‌ సంస్థ శుక్రవారం ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. రజనీకాంత్‌కు కారు తాళాలు అందిస్తున్న వీడియోను షేర్‌ చేశారు. కారు తాళాలు అందుకున్న తర్వాత రజినీ కాసేపు కారులో కూర్చున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?
'ది' విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఖుషి'. ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. సాంగ్స్ హిట్ కావడం... విజయ్ దేవరకొండ, సమంత జోడీ... విజువల్స్... ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)