రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సలార్' (Salaar Movie). 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ తాము కోరుకున్న విధంగా తమ అభిమాన కథానాయకుడిని చూపిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. వాళ్ళకు భారీ షాక్ తగిలే అంశం ఇది. 'సలార్' విడుదల ఎప్పుడు? ఈ ప్రశ్న ప్రేక్షకులు ఎవరిని అడిగినా సరే... సెప్టెంబర్ 28 అని చెబుతారు. అయితే... ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ఆ తేదీకి ఈ సినిమా వచ్చే అవకాశం లేదట!


సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌కు వాయిదా?
Salaar Postponed : సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేయడం కుదరడం లేదని, డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లకు 'సలార్' ఫిల్మ్ మేకర్స్ నుంచి సమాచారం వచ్చిందట! తమ సినిమా విడుదల వాయిదా పడుతోందని స్పష్టం చేశారట. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అనధికారికంగా చెబుతున్నారు. వాయిదా వేసిన అంశాన్ని తొలుత ప్రకటించి... ఆ తర్వాత కొన్ని రోజులకు కొత్త విడుదల తేదీ చెబుతారట! అది డిసెంబరా? లేదంటే ఆ తర్వాతా? అనేది తెలియడానికి కొంత టైమ్‌ పడుతుంది.


Also Read : 'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?


'సలార్' వాయిదా పడిన కారణంగా ఆ తేదీకి ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఓ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'మ్యాడ్'ను తీసుకు వస్తున్నారని మరో ఖబర్.


'సలార్'ను ఎందుకు వాయిదా వేస్తున్నారు?
అమెరికాలో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. పలువురు టికెట్స్ కొన్నారు. ఈ తరుణంలో ఎందుకు వాయిదా వేస్తున్నారు? కారణం ఏమిటి? అని చూస్తే... సీజీ వర్క్ సరిగా రాలేదని వినబడుతోంది. యాక్షన్ దృశ్యాలతో పాటు కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తి వ్యక్తం చేశారట. అందువల్ల, విడుదల వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. 


'సలార్' సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. ఆమె జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రావు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత.  


Also Read : ఫ్లాప్ ప్రొడ్యూసర్లకు వరుణ్ తేజ్ భరోసా - వాళ్ళకు అండగా నిలబడటం కోసం...



'సలార్' నటీనటులకు ఓ కండిషన్...
ఆ ఒక్కటీ లీక్ కాకూడదని అలా అలా!
'ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు! టీవీ ఛానల్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్... ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వకండి' అని నటీనటులకు చాలా ఖరాకండీగా హోంబలే ఫిలింస్ చెప్పిందని సమాచారం. ఆఖరికి పేపర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని చెప్పారట. అందుకు ముఖ్య కారణం స్టోరీ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే! 


ఇంటర్వ్యూలు ఇస్తే... మాటల మధ్యలో పొరపాటున కథ గురించి చెబుతారేమో? ఒకసారి కథ గురించి ఏదైనా విషయం చెప్పిన తర్వాత అది డిలీట్ చేయించడం కష్టం కనుక అసలు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని చెప్పేశారట. అదీ సంగతి!


ప్రభాస్ ముఖం సరిగా కనిపించకున్నా...
ఆల్రెడీ 'సలార్' టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ ముఖం అసలు కనిపించలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం అదిరింది. ఒక్క విషయంలో క్లారిటీ కూడా వచ్చింది.  'సలార్' రెండు భాగాలుగా థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ చివరిలో 'పార్ట్ 1 : సీస్ ఫైర్' (Salaar Ceasefire) అని పేర్కొన్నారు. దీంతో పాటు మరో పార్ట్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial