సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ను నిర్మాతలు, సినిమా బృందం అంతా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్‌కు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ సూపర్ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును ఆయనకు అందించారు. సన్‌పిక్చర్స్ సంస్థ శుక్రవారం ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. రజనీకాంత్‌కు కారు తాళాలు అందిస్తున్న వీడియోను షేర్ చేశారు. కారు తాళాలు అందుకున్న తర్వాత రజినీ కాసేపు కారులో కూర్చున్నారు.
బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఎక్స్7 రెండింటిలో నచ్చిన కారును ఎంపిక చేసుకోవాలని కళానిధి మారన్ రజినీకాంత్‌ను కోరారు. దీంతో రజినీ కాంత్ ఎక్స్7 తీసుకున్నారు. ఈ కారు విలువ రూ.1.24 కోట్లు ఉంటుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో, రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న రిలీజై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్’ రూ.600 కోట్ల మార్క్‌ను దాటి సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో నడుస్తోంది.
కోలీవుడ్‌లో ‘జైలర్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రజనీ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇటీవల ‘జైలర్’ రూ.525 కోట్లు వసూలు చేసిందని సన్ పిక్చర్స్ అధికారికంగా వెల్లడించింది. ఒక్క తమిళనాడులోనే రూ. 328 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రల్లో సుమారు రూ.100 కోట్లు వసూలు చేసిందట ఈ మూవీ. రజనీకాంత్ 2.0 సినిమా తమిళంలో అత్యధిక వసూళ్లు రాబట్టింది. అక్కడ రూ.615 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టించింది. అయితే ‘జైలర్’ ఈ రికార్డులు దాటుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘జైలర్’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న సన్ నెక్ట్స్
ఈ సినిమా కథ టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) అనే రిటైర్డ్ జైలర్ చుట్టూ తిరుగుతుంది. తప్పిపోయిన తన కొడుకు అర్జున్ (వసంత్ రవి) కోసం వెతికే క్రమంలో ఎలాంటి ఊహించని ఘటనలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు. ఇక ఈ సూపర్ హిట్ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. థియేటర్లలో అద్భుత ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీని ఓ దిగ్గజ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘జైలర్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను పొందేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి. సన్ పిక్చర్స్ అనుబంధ సంస్థ సన్ నెక్ట్స్ OTT హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, సినిమా పరిశ్రమలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అనే విషయంపై క్లారిటీ వచ్చింది. సుమారు నెలన్నర తర్వాత సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!