మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1970 ల కాలంలో స్టువర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. రవితేజ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమా ప్రమోషన్స్ ని మ్యూజిక్‌తో స్టార్ట్ చేస్తున్నారు.


ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ని సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'ఏక్ దమ్.. ఏక్ దమ్' అంటూ సాగే ఈ సాంగ్‌కు సంబంధించి ఒక పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇక ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ, నుపూర్ సనన్ రెట్రో లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. నుపుర్ సనన్  చేతిలో పుస్తకాలు పట్టుకుని కాలేజీ విద్యార్థినిగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఇక రవితేజ ఆమెను టీజ్ చేస్తూ ఉండగా, బ్యాగ్రౌండ్ లో డాన్సర్స్ కూడా ఉన్నారు. వీటిని బట్టి చూస్తే ఇది ఒక పెప్పి నంబర్ అని చెప్పొచ్చు. హీరో, హీరోయిన్ల పై వచ్చే ఈ సాంగ్ మాస్ మహారాజా ఫ్యాన్స్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నట్లు ఈ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.






కాగా ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో బెస్ట్ ఆల్బమ్స్ అందించాడు జీవి ప్రకాష్. దీంతో టైగర్ నాగేశ్వరావు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటి రేణు దేశాయ్ మరో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ సినిమాతోనే రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తోంది. ఇందులో రవితేజ సోదరిగా 'హేమలత లవణం' అనే పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.


రవితేజ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కథకి యూనివర్సల్ అప్పీల్ ఉండడంతో మేకర్స్ ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బానర్ పై రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' అనే సినిమా చేస్తున్నారు రవితేజ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లండన్ లో శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు మేకర్స్.


Also Read : 'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial