మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) ఓ కథానాయకుడిగా నటించిన సినిమా 'మ్యాడ్' (MAD Movie). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రమిది. 


యువతరం మెచ్చే కథతో ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా 'మ్యాడ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రక్షా బంధన్ రోజున చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... విడుదల తేదీ ప్రకటించారు. 


సెప్టెంబర్ 28న 'మ్యాడ్' విడుదల
MAD Movie Release Date : సెప్టెంబర్ 28 అంటే పాన్ ఇండియా ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' గుర్తుకు వస్తుంది. ఆ సినిమాను ఆ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సలార్' వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు అనుకోండి... 'మ్యాడ్' చిత్రాన్ని సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇవాళ వెల్లడించారు. 


'మ్యాడ్' చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.






'మ్యాడ్' సినిమాలో ఎవరెవరు ఉన్నారు?
'మ్యాడ్' చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నార్నే నితిన్ ఓ హీరో కాగా... సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Also Read : ప్రభాస్ అభిమానులకు షాక్ - 'సలార్' విడుదల వాయిదా!?



యువతను ఆకర్షించిన 'మ్యాడ్' టీజర్!
'మ్యాడ్' టీజర్ ద్వారా సినిమా జానర్ ఏమిటి? అనేది క్లారిటీగా చెప్పేశారు. యూత్ బేస్డ్ కామెడీ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. టీజర్లో కొన్ని డైలాగుల్లో డబుల్ మీనింగ్ ధ్వనించింది. సినిమా ఎలా ఉంటుంది? అనేది విడుదలైన తర్వాత తెలుస్తుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారట. 


Also Read 'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?


నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మ్యాడ్' చిత్రానికి ఫైట్ మాస్టర్ : కరుణాకర్, అడిషనల్ స్క్రీన్ ప్లే : ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి, కళా దర్శకత్వం : రామ్ అరసవిల్లి, కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : షామ్‌ దత్ సైనుద్దీన్ - దినేష్ కృష్ణన్ బి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ : సూర్యదేవర నాగ వంశీ, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య, రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial