'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!
వరుస పరాజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మంచు విష్ణు, ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజీలాండ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శ్రీ కాళహస్తిలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.  దాదాపు షూటింగ్ అంతా న్యూజీలాండ్ లోనే కంప్లీట్ కానున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


తలైవర్ 170 సెట్స్​లో బిగ్ బీ, రజనీ - మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసిన దిగ్గజాలు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. అదే ఊపులో తన కెరీర్ లో 170వ సినిమా చేస్తున్నారు. 'జైభీమ్' ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన్ వేల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు.  ఈ సినిమాకు ‘Thalaivar 170‘ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించబోతున్నారు. తెలుగు నుంచి రానా ద‌గ్గుబాటి ఈ మూవీలో నటిస్తుండగా, మ‌ళ‌యాళం నుంచి ఫ‌హాద్ ఫాజిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.  పలువురు అగ్ర తారలు ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'జిగర్తాండ డబుల్ ఎక్స్' రిలీజ్ డేట్ - లారెన్స్ సినిమా థియేటర్స్​లోకి వచ్చేది అప్పుడే?
కోలీవుడ్ అగ్ర హీరో రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ద్వారా లారెన్స్ కి బర్త్ డే విషెస్ అందజేస్తూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. రాఘవ లారెన్స్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కాంచన 3' తర్వాత డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే 'చంద్రముఖి 2'(Chandramukhi 2) తో ప్రేక్షకులను పలకరించిన ఈ కోలీవుడ్ హీరో ఇప్పుడు 'జిగర్తండ డబుల్ ఎక్స్'(Jigarthanda Double Ex) మూవీ తో రాబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


గ్రాండ్​గా 'కీడా కోలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ - చీఫ్ గెస్ట్​గా ఆ స్టార్ హీరో!
తరుణ్ భాస్కర్ దర్శకత్వ వహించిన 'కీడా కోలా' మూవీ నవంబర్ 3న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఇదే విషయాన్ని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేసిన తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తీసిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో యూత్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘భారతీయుడు 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్, గ్లింప్స్‌ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ సినిమా పరిశ్రమలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2‘. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ‘ఇండియన్ 2‘ గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)