కోలీవుడ్ అగ్ర హీరో రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ద్వారా లారెన్స్ కి బర్త్ డే విషెస్ అందజేస్తూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. రాఘవ లారెన్స్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కాంచన 3' తర్వాత డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే 'చంద్రముఖి 2'(Chandramukhi 2) తో ప్రేక్షకులను పలకరించిన ఈ కోలీవుడ్ హీరో ఇప్పుడు 'జిగర్తండ డబుల్ ఎక్స్'(Jigarthanda Double Ex) మూవీ తో రాబోతున్నారు.


కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'జిగర్తాండ' సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందింది. 'జిగర్తాండ' సెన్సేషనల్ హిట్ అవ్వడంతో స్టార్ డైరెక్టర్ గా మారిన కార్తీక్ సుబ్బరాజ్ ఆ సినిమాకి సీక్వెల్ గా 'జిగర్తండ డబుల్ ఎక్స్' ని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అనూహ్య స్పందనను అందుకోవడమే కాకుండా సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. రాఘవ లారెన్స్ తో పాటు తమిళ నటుడు ఎస్ జే సూర్య మరో హీరోగా కనిపించనున్నాడు. 1980's బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.






ఆదివారం అక్టోబర్ 29 రాఘవ లారెన్స్ బర్త్ డే కావడంతో ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ 'హ్యాపీ బర్త్ డే మాస్టర్' అంటూ లారెన్స్ కి బర్త్ డే విషెస్ ను అందజేశారు. అలాగే ఇదే పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫార్మ్ చేశారు. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో లారెన్స్ ఉర మాస్ అవతార్లో అదరగొట్టేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయడంతో పాటు తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.


సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే 'జిగర్తాండ డబుల్ ఎక్స్' చిత్రాన్ని ఇతర భాషలో ప్రముఖ సంస్థలు విడుదల చేయనున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఏషియన్ సినిమాస్ విడుదల చేయనున్నారు. ఇక రాఘవ లారెన్స్ రీసెంట్ గా 'చంద్రముఖి 2' తో ప్రేక్షకుల్ని నిరాశపరిచాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకున్నా రాఘవ లారెన్స్ ఈ మూవీ కోసం ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవడం గమనార్హం. మరి 'చంద్రముఖి 2'తో నిరాశపరిచిన రాఘవ లారెన్స్ 'జిగర్తాండ డబుల్ ఎక్స్' తో ఆడియన్స్ ని ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.


Also Read : గ్రాండ్​గా 'కీడా కోలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ - చీఫ్ గెస్ట్​గా ఆ స్టార్ హీరో!







Join Us on Telegram: https://t.me/abpdesamofficial