రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్,’ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం
‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న.. వరుస సినిమాలతో సౌత్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ అనే సినిమా చేసింది. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప2’లో హీరోయిన్ గా చేస్తోంది. అటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘రెయిన్ బో’ సినిమాలోనూ నటిస్తోంది. అటు విక్కీ కౌషల్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టీవీల్లోకి వచ్చేస్తున్న ప్రభాస్ 'ఆదిపురుష్' - టెలికాస్ట్ అయ్యేది ఆరోజే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. థియేటర్స్ లో విడుదలై ప్లాప్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతోంది. వచ్చే ఆదివారమే టెలికాస్ట్ కాబోతోంది. డీటెయిల్స్ లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్' ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా కృతి సనన్ సీతగా కనిపించింది. అలాగే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవ దత్త నగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ నటించిన మొదటి పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నాగార్జున చేతికి కార్తీ సినిమా - 'జపాన్' తెలుగు రైట్స్ దక్కించుకుకున్న అన్నపూర్ణ స్టూడియోస్!
ప్రస్తుతం కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు తమిళ హీరో కార్తి. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే 'విరుమన్', 'సర్దార్', 'పొన్నియన్ సెల్వన్' వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కార్తి నటిస్తున్న తాజా చిత్రం 'జపాన్'(Japan). కార్తీ కెరియర్ లోనే ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా 'జపాన్'తెరకెక్కుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జోకర్ ఫేమ్ మురుగన్ దర్శకత్వ వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నాని కొత్త సినిమాలో తమిళ నటుడు - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్!
కోలీవుడ్ దర్శకుడు SJ సూర్య నటుడిగా ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిగ్ స్క్రీన్స్ పై అలరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూ సందడి చేస్తున్నారు. రీసెంట్గా విశాల్ నటించిన 'మార్క్ ఆంటోనీ' మూవీలో తన పర్ఫామెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఈయన ఇప్పుడు తెలుగులో మరో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి‘ జోష్, మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎదిగే వయసు అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించారు. ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. తొలి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)