ప్రస్తుతం కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు తమిళ హీరో కార్తి. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే 'విరుమన్', 'సర్దార్', 'పొన్నియన్ సెల్వన్' వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కార్తి నటిస్తున్న తాజా చిత్రం 'జపాన్'(Japan). కార్తీ కెరియర్ లోనే ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా 'జపాన్'తెరకెక్కుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జోకర్ ఫేమ్ మురుగన్ దర్శకత్వ వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది.


ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రైట్స్ ని కింగ్ నాగార్జున దక్కించుకున్నారు. నాగ్ అండర్ లో నడిచే అన్నపూర్ణ స్టూడియోస్ 'జపాన్' తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ కార్తీ సినిమాని దక్కించుకోవడంతో తెలుగులోనూ 'జపాన్' గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈమధ్య ఇతర భాషల సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటే కార్తీ 'జపాన్' తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకోవడం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థలకు కాకుండా నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కి కార్తీ జపాన్ తెలుగు రైట్స్ ఇవ్వడం వెనక ఓ రీజన్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.


అదేంటంటే, కార్తీతో నాగార్జునకి మంచి బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 'ఊపిరి' అనే ఎమోషనల్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే కదా. ఊపిరి టైం నుంచి కార్తీక, నాగార్జున మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కార్తీ నటించిన ప్రతి సినిమాకి నాగార్జున తన బెస్ట్ విషెస్ అందిస్తారు. ఈ క్రమంలోనే కార్తీ నటించిన 'జపాన్' సినిమా తెలుగు హక్కులను నాగార్జున భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కార్తీ మరో డిఫరెంట్ మేకవర్ తో అలరించబోతున్నాడు.


రీసెంట్ గా విడుదలైన టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమా దొంగతనాల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఒక అజ్ఞాత వ్యక్తి రూ.200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఈ మూవీ ఉండబోతోంది. సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యూయేల్ కథానాయికగా నటిస్తోంది. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. రవి వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా తర్వాత ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కార్తీ. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.


Also Read : బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి‘ జోష్, మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial