కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ నటించిన రీసెంట్ మూవీ 'చంద్రముఖి 2'(Chandramukhi 2) ఓటీటీ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అనుకున్న తేదీ కంటే కాస్త ముందుగానే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే.. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన 'చంద్రముఖి 2' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి'(Chandramukhi) చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ సీక్వెల్ ని తెరకెక్కించారు.


దాదాపు 17 ఏళ్ల తర్వాత 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ తెరకెక్కడం, హారర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాఘవ లారెన్స్ ఈ సీక్వెల్ లో భాగమవడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. పోస్టర్స్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ని అందుకుంది. తమిళంలో తప్పితే మిగతా భాషల ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం.






సినిమాలో లారెన్స్జ్ కంగనా నటనపరంగా ఆకట్టుకున్నా కథ, కథనంలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపించలేదు. దీంతో విడుదలైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. 'చంద్రముఖి 2' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్టోబర్ 27న 'చంద్రముఖి 2' నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. కానీ ఆ తేదీన కాకుండా ఒక్కరోజు ముందుగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. అక్టోబర్ 26 నుంచే ఈ 'చంద్రముఖి 2' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది.


తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. మరోవైపు 'చంద్రముఖి 2' ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ అందుకున్నా సినిమా వల్ల నిర్మాతలకి పెద్దగా నష్టాలేవి రాలేదు. ఎందుకంటే విడుదలకు ముందే ఈ మూవీ భారీ బిజినెస్ జరుపుకొని సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం రాఘవ లారెన్స్ ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. లారెన్స్ ఇంత మొత్తంలో ఓ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారి. గత సినిమాలతో పోలిస్తే లారెన్స్ 'చంద్రముఖి 2' కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ. ఇదే విషయం రీసెంట్ గా కోలీవుడ్లో ఎంతో హాట్ టాపిక్ అయింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. అటు నిర్మాతలకు ఇటు రాఘవ లారెన్స్ కి మాత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టింది.


Also Read : చెన్నైలోనే తమిళ్ మూవీస్ హిందీ సెన్సార్‌షిప్‌, విశాల్ దెబ్బ‌కు CBFC కీలక నిర్ణయం



Join Us on Telegram: https://t.me/abpdesamofficial