కోలీవుడ్ దర్శకుడు SJ సూర్య నటుడిగా ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్​తో బిగ్ స్క్రీన్స్ పై అలరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూ సందడి చేస్తున్నారు. రీసెంట్​గా విశాల్ నటించిన 'మార్క్ ఆంటోనీ' మూవీలో తన పర్ఫామెన్స్​తో సినిమాని నెక్స్ట్ లెవెల్​కి తీసుకెళ్లిన ఈయన ఇప్పుడు తెలుగులో మరో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.


ఈ అనౌన్స్మెంట్ వీడియోలో సోమవారం సినిమాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని, మంగళవారం గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా థ్రిల్ అయ్యే ఎలిమెంట్లు, చిల్ అయ్యేలా ఫుల్ ఫన్ తో ఈ మూవీ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. వివేక్ ఆత్రేయతో ఇప్పటికే నాని 'అంటే సుందరానికి' అనే సినిమా చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ కలిసి వర్క్ చేస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ని వెల్లడించారు.






అదేంటంటే ఈ చిత్రంలో తమిళ నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో SJ సూర్య ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని కెరియర్ లో 31వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే నానితో కలిసి 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి వీరి జంట బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాని 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది.


శౌర్యవ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ నేపథ్యంలో ఎమోషనల్ జర్నీగా ఉండబోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాలో శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదటగా క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి 'సలార్' మూవీ రిలీజ్ ఉండడంతో డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.


Also Read : అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'చంద్రముఖి 2' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial