మన్సూర్ అలీ ఖాన్, త్రిష కేసులో కొత్త ట్విస్ట్ - చిరంజీవిపై పరువు నష్టం దావా
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ యూ టర్న్ తీసుకున్నారు. కథానాయిక త్రిషకు క్షమాపణ చెప్పి కనీసం వారం కూడా గడవక ముందు కొత్త వివాదానికి తెర తీశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'లియో'లో మన్సూర్ అలీ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించారు. అందులో కథానాయిక త్రిషతో తనకు రేప్ సీన్ లేదని ఒక విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయ్యింది. ఈ నెల (నవంబర్) 11న ఆయన కామెంట్స్ చేస్తే... కొంత ఆలస్యంగా అది వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలను పలువురు ప్రముఖులు ఖండించారు. జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?
సిద్ధార్థ్ హీరోగా నటించిన 'గృహం' తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. ఆ సినిమా దర్శకుడు మిళింద్ రావు తీసిన వెబ్ సిరీస్ 'ది విలేజ్'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్య, దివ్యా పిళ్ళై, 'ఆడుకాలం' నరేన్, ముత్తు కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నటించారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన సిరీస్ ఇది! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దక్షిణాది భాషల్లో 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - అంజలి 50వ సినిమా విడుదల ఎప్పుడంటే?
తెలుగు చిత్రసీమలో వచ్చిన సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమాల్లో 'గీతాంజలి' కూడా ఉంటుంది. అందులో తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించారు. హారర్ కామెడీల్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చేస్తున్నారు. ఆ విషయం ప్రేక్షకులకూ తెలుసు. ప్రతీకార జ్వాల‌తో గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ రచయిత,  నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓపెనింగ్స్ కంటే రెండో రోజు 50% ఎక్కువ - బాక్సాఫీస్ బరిలో ఇరగదీస్తున్న 'కోటబొమ్మాళి'
కంటెంట్ బేస్డ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. కోట బొమ్మాళి పీఎస్' సినిమాలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ (Srikanth) మేక ప్రధాన పాత్ర పోషించారు. ఎస్పీ రజియా అలీ పాత్రలో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నటించారు. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పుకార్లకు చెక్ - త్వరలో సెట్స్ మీదకు వరుణ్ తేజ్ 'మట్కా
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్రూ టే సపరేటు! తనను తాను ఓ ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా చూసుకుంటూ... కంటెంట్ బేస్డ్ కథలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో 'మట్కా' చేయడానికి 'ఎస్' చెప్పారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'మట్కా'. హీరోగా ఆయన 14వ చిత్రమిది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్. 'బాహుబలి', 'టెంపర్', 'ఊపిరి' సినిమాలతో పాటు కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసిన నోరా ఫతేహి మరో కథానాయిక. వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలోనూ ఆమె స్పెషల్ సాంగ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)