Rashmika Mandanna Turns Dubbing Artist For Animal Movie: రష్మికా మందన్నా... నేషనల్ క్రష్! అందంలో మాత్రమే కాదు... అభినయంలో కూడా ఆవిడ నేషనల్ ఆడియన్స్ చేత ప్రశంసలు అందుకున్నారు. రష్మిక బహుభాషా నటి మాత్రమే కాదు... బహు భాషలు తెలిసిన నటి! ఇప్పుడు 'యానిమల్' కోసం ఆవిడ మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పారు.
తెలుగుతో పాటు హిందీ, కన్నడలో!
How many languages does Rashmika Mandanna know: రష్మికా మందన్నాకు మొత్తం ఆరు భాషలు వచ్చు. కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం (కొడగు జిల్లా)లో ఆమె జన్మించారు. రష్మిక మాతృభాష కొడవ. కూర్గ్ ఏరియాలో మాట్లాడే ద్రవిడియన్ భాష అది. దాంతో పాటు ఆవిడకు కన్నడ వచ్చు.
మాతృభాష, కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషలు రష్మికకు వచ్చు. ఇక, ఆవిడ డిగ్రీ ఏంటో తెలుసా? బెంగళూరులో డిగ్రీ చేశారు. సైకాలజీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. అందుకని, ఇంగ్లీష్ బాగా వచ్చు. 'యానిమల్' కోసం హిందీ, తెలుగు, కన్నడలో రష్మిక డబ్బింగ్ చెప్పారు.
Also Read: సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!
Animal movie director name: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా 'యానిమల్'. ఇందులో రణబీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటించారు. వాళ్ళిద్దరూ నటించిన తొలి చిత్రమిది. ఇందులో గీతాంజలి పాత్రలో నేషనల్ క్రష్ నటించారు. హీరో భార్య పాత్రలో ఆవిడ ఎమోషనల్ రోల్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read: త్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?
రష్మిక పాత్ర గురించి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ''రష్మిక గారిది 'యానిమల్'లో చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా ఆద్యంతం ఆమె కనిపిస్తూ ఉంటారు. రెగ్యులర్ సినిమాల్లో ఉన్నట్టు కాకుండా కాకుండా చాలా వైవిధ్యంగా ఉంటుంది. హీరోని అతని తల్లిదండ్రుల కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర ఆమెది. ఇందులో హీరో తర్వాత అంతటి ప్రాధన్యత వున్నది రష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది'' అని అన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు రష్మిక కూడా వివిధ నగరాలు తిరుగుతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' షోకి వచ్చారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ అంటూ అన్ని నగరాల్లో ప్రచారం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే బావున్నాయి. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.