Home Remedies for Healthy Skin : చలికాలంలో జుట్టు, చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, చల్లగాలుల ప్రభావం వల్ల చర్మం పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది. తేమ స్థాయిలలో తగ్గుదల వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీనివల్ల దురద, అలెర్జీ, తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండ చర్మం సహజమైన రంగును కోల్పోయి.. టాన్ అయిపోతుంది. మీరు కూడా వింటర్​లో ఈ చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా?


శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలను మీరు ఇంట్లో ఉంటూనే తగ్గించుకోవచ్చు. కొన్ని చిట్కాలు, హోమ్​ రెమిడీస్​ ఫాలో అయితే మీ చర్మాన్ని చలిగాలుల నుంచి రక్షించుకోవచ్చు. ఇవి మీ చర్మానికి తేమను అందించడంతో పాటు.. మెరుపును కూడా అందిస్తాయి. కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు ఉపయోగిస్తే మీకు ఇబ్బంది ఉంది అనుకుంటే మీరు ఈ ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. ఇవి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్యలను దూరం చేస్తూ సహజమైన మెరుపును అందిస్తాయి. ఇంతకీ ఆ చిట్కాలేమిటంటే..


కొబ్బరి నూనె


ఏ కాలంలోనైనా కొబ్బరి నూనె చర్మానికి అందించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా చలికాలంలో దీనిని వినియోగిస్తే.. అన్ని చర్మ సమస్యలు దూరమవుతాయి. ఇది మీ చర్మం తేమ లాక్​ చేసే అద్భుతమైన ఎమోలియెంట్. చలికాలంలో కాస్త కొబ్బరి నూనె తీసుకుని.. చర్మానికి మసాజ్ చేయండి. ముఖ్యంగా మీ చర్మం ఎక్కువగా ఎక్కడ పొడిబారుతుందో గుర్తించి.. అక్కడ ఈ ఆయిల్​తో మసాజ్ చేయండి. కాస్త గోరువెచ్చని నూనె తీసుకుంటే మరీ మంచిది. దీని వల్ల చర్మానికి పోషణ అందడమే కాకుండా.. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. 


ఆలివ్ నూనె


ఆలివ్​ నూనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయితే ఇది అందాన్ని రక్షించడంలో కూడా అంతే ముఖ్యపాత్ర పోషిస్తుంది. చలకాలంలో ఇది సహజ మాయిశ్చరైజర్​గా అద్భుతాలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి.. చర్మానికి మంచి తేమను అందిస్తుంది. 


ఆలివ్​నూనెను మీరు చర్మ సంరక్షణ కోసం ఉపయోగించాలనుకుంటే.. నిద్రపోయే ముందు.. కొన్ని చుక్కల ఆలివ్​ నూనెను తీసుకుని.. చేతులతో రబ్ చేయండి. అది కాస్త వేడిని ఇచ్చాక.. చర్మానికి అప్లై చేయండి. ఉదయాన్నే మీరు చర్మంలో మార్పులు మీరే గమనించవచ్చు. లేదంటే ఆలివ్​ నూనెల చక్కెర వేసి మీరు స్క్రబ్​గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. అలాగే చర్మానికి మంచి పోషణను కూడా అందిస్తుంది. 


అలోవెరా 


అలోవెరా సహజమైన మాయిశ్చరైజర్​గా పని చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ విరివిగా దొరికే ఈ మొక్కతో మీరు ఎన్ని హెల్త్, బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇది మీకు పొడి చర్మం నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా స్కిన్​ని హైడ్రేట్ చేస్తుంది. మీరు తాజా అలోవెరా జెల్​ తీసుకుని.. ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేయవచ్చు. 20 నిముషాలు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇది రెగ్యూలర్​గా ఉపయోగిస్తే.. మీ చర్మం హైడ్రేట్ కావడమేకాకుండా.. మంచి మెరుపును సొంతం చేసుకుంటుంది. 


పెరుగు, తేనె ప్యాక్


పెరుగు స్కిన్, హెయిర్ సంరక్షణలో ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. దానిలో కాస్త తేనె కలిపి చర్మానికి అప్లై చేస్తే.. మీ చర్మం తేమను సంతరించుకోవడంతో పాటు.. మెరుపును సొంతం చేసుకుంటుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం.. చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేయడంలో సహాయం చేస్తుంది. 


ఈ ప్యాక్​ తయారు చేసుకునేందుకు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మం కోల్పోయిన్ తేమను తిరిగి అందించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా చర్మం మృదుత్వాన్ని పెంచుతుంది. 


Also Read : ఈ డ్రింక్​తో బరువు తగ్గొచ్చు.. షుగర్​ కూడా కంట్రోల్ చేయొచ్చు


ఓట్​మీల్ 


చర్మం పొడిబారి పోవడం, దురద లక్షణాల నుంచి ఓట్​మీల్ ఉపశమనం అందిస్తుంది. దీనికోసం మీరు ఓట్స్​ను ఉడకబెట్టి.. దానిని పేస్ట్​ చేసి.. స్నానానికి వెళ్లేముందు అప్లై చేయండి. లేదంటే నీళ్లలో దీనిని కలిపి మీరు కూడా బాత్​ టబ్​లో కాసేపు సేదతీరండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను పొంది.. చికాకునుంచి ఉపశమనం ఇస్తుంది. 


ఈ టిప్స్​ను మీరు ఏ సీజన్​లోనైనా ఫాలో అవ్వొచ్చు. ఇవి మీ చర్మానికి చాలా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో మీ చర్మం నిగనిగలాడాలంటే ఖర్చు లేకుండా ఇంట్లోనే వీటిని ఫాలో అవ్వండి. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆


*T&C Apply*