Aadikeshava flop or hit: 'ఆదికేశవ' హిట్టా? ఫ్లాపా? అని క్వశ్చన్ వేస్తే... సినిమా చూసిన మెజారిటీ ప్రేక్షకుల నుంచి వచ్చే సమాధానం ఒక్కటే! అందులో మరో సందేహం అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ ఊర మాస్ సినిమాకు పెయిడ్ ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ఏమంత గొప్పగా రాలేదు. విమర్శకులు అందరూ మరో సందేహం లేకుండా ఫ్లాప్ అని తేల్చేశారు. అయితే... సినిమా హిట్టా? ఫ్లాపా? అనేది పక్కన పెడితే... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ సెలక్షన్ మీద సందేహాలు రేకెత్తించిన సినిమాగా 'ఆదికేశవ' మిగిలింది. 


ఏంటిది గురూజీ... మళ్ళీ అదే కథ!? 
'ఆదికేశవ' నిర్మాతల్లో సాయి సౌజన్య ఒకరు. ఆవిడ త్రివిక్రమ్ సతీమణి! పోస్టర్ మీద శ్రీమతి పేరు ఉన్నప్పటికీ... తెర వెనుక రచన, నిర్మాణ వ్యవహారాల్లో కర్త, కర్మ, క్రియ అన్నీ త్రివిక్రమ్ అనేది పరిశ్రమకు తెలిసిన విషయమే. 


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో వచ్చిన 'డీజే టిల్లు', 'సార్' మంచి విజయాలు సాధించాయి. ఆయా సినిమాల దర్శక రచయితలు తమకు త్రివిక్రమ్ మంచి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చారని చెప్పారు. మరి, 'ఆదికేశవ' సినిమాకు ఆయన ఇన్‌పుట్ ఏమీ ఇవ్వలేదా? అని అభిమానులలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు, ఈ కథను త్రివిక్రమ్ ఎందుకు ఓకే చేశారు? అనే కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు. 


రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన పది పదిహేను కమర్షియల్ సినిమాలు చూస్తే 'ఆదికేశవ' కథ వన్ పర్సెంట్ కూడా కొత్తగా ఉండదు. పాత సినిమాలను మిక్సీలో వేసి తీసినట్లు ఉంటుంది. ఇటువంటి రొటీన్ కథను త్రివిక్రమ్ ఎందుకు ఓకే చేశారు? అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. మరొకటి ఏమిటంటే... 'అల వైకుంఠపురములో' హీరో హీరోయిన్స్ మధ్య ట్రాక్ & 'ఆదికేశవ'లో హీరో హీరోయిన్స్ మధ్య ట్రాక్ దగ్గర దగ్గరగా ఉండటం!


Also Readకోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా? 


'అల వైకుంఠపురములో' సినిమా గుర్తు ఉందిగా! హీరోయిన్ పూజా హెగ్డే కంపెనీలో అల్లు అర్జున్ ఉద్యోగి. తొలుత మేడమ్ అన్నప్పటికీ... చూపులు అన్నీ ఆమె కాళ్ళ మీద ఉంటాయి. ఆ విషయం తెలిసి తన చుట్టూ తిప్పుకుంటుంది హీరోయిన్. 'సామజవరగమన' పాటలో ఉన్నది అదే కదా! చివరకు ఇద్దరూ ప్రేమలో పడతారు. 'ఆదికేశవ'కు వస్తే... ఇక్కడ కూడా శ్రీ లీల కంపెనీలో వైష్ణవ్ తేజ్ ఉద్యోగి. ఆమెను ప్రేమిస్తాడు. చివరకు ఇద్దరు ప్రేమలో పడతారు. సేమ్ ట్రాక్ ఉన్న సినిమాను గురూజీ ఎందుకు ఓకే చేశారు? అనేది అభిమానులకు అర్థం కావడం లేదు. 


Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?


తప్పు ఎక్కడ జరిగినప్పటికీ... వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. 'ఉప్పెన' తర్వాత మరోసారి ఆ స్థాయి విజయం ఆయనకు అందని ద్రాక్ష అయ్యింది. ఈ సినిమాతో అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే... దర్శక రచయితలు ఎవరైనా సరే, త్రివిక్రమ్ సతీమణి నిర్మాతగా ఉన్న సినిమా ఫ్లాప్ అయితే ఆయన మీద విమర్శలు వస్తాయని!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply